పంచాంగ శ్రవణం

Panchanga Sravanam

Telugu Festival Tradition : Panchanga Sravanam (Ugadi) –

తెలుగువారి తొలి పండుగ ఉగాది. పర్వదినం నాడు పంచాంగ శ్రవణానికి వెళ్లడం తెలుగువారి సంప్రదాయం. రోజు దేవాలయం లోనో, రచ్చబండ దగ్గరో పురోహితుడి నుంచి ఏడాది తమ జీవనం ఎలా సాగుతుందో, వాతావరణం ఎలా ఉంటుంది, పంటల పరిస్థితి ఏమిటి? అనే విషయాలను తెలుసుకునేందుకు ఉత్సుకత చూపుతారు. ఉగాది రోజున వేపపచ్చడి ఎంత ముఖ్యమో పంచాంగశ్రవణం కూడా అంతే ముఖ్యం అంటారు పెద్దలు.



నవనాయకుల సంచార విశేషాలు

పంచాంగం ప్రకారం వ్యవసాయానికీ, వర్షానికీ, రాజ్యానికీఇలా ప్రతి విభాగానికీ అధిపతి ఉంటాడు. ఇలా తొమ్మిదిమంది నాయకులను నవనాయకులు అని పిలుస్తారు. వీరి సంచారం వల్ల రాబోయే రోజులలో వ్యవసాయం ఎలా ఉంటుంది, దేశంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహిస్తారు. నవనాయకుల సంగతి అలా ఉంచితేఒకో మాసానికీ అధిపతిగా ఉండే గ్రహం వల్ల కూడా అనూహ్య ఫలితాలు ఉండవచ్చు.

ఒకో మనిషి నక్షత్రం ప్రకారం అతని ఆదాయవ్యయాలు, రాజపూజ్య అవమానాలూ లెక్కకడతారు. దీని వల్ల మనుషులలో ఆదాయాన్ని మించి ఖర్చు చేయకూడదనీ, అనువు కానీ చోట అధికులమని అవమానం పాలు కాకూడదనీ జాగ్రత్త ఏర్పడుతుంది. ధార్మికులకు పంచాంగం ఇంత ఉపయుక్తం కాబట్టేసంవత్సరపు తొలిరోజున పంచాంగ శ్రవణం చేసి తీరాలంటారు పెద్దలు.

ధార్మికపరమైన సందేహాల నివృత్తి ధార్మికపరమైన సందేహాలను తీర్చుకునేందుకు కూడా పంచాంగ శ్రవణం అవసరం. అధికమాసంలో శుభకార్యాలు చేసుకోవచ్చా? గ్రహస్థితి బాగోలేకపోతే ఏం చేయాలి? నోములు ఎప్పుడు జరుపుకోవాలి? వ్రతం ఎలా చేసుకోవాలి?… వంటి సవాలక్ష సందేహాలన్నింటికీ ఊరూరా పంచాంగ శ్రవణం వేదికగా మారుతుంది. అందుకనే పంచాంగ శ్రవణ చేసినవారికీ, విన్నవారికీ కూడా నవగ్రహాల ఆశీస్సులు లభిస్తాయని ఫలశ్రుతిగా చెబుతారు.

 

Read More : నమస్కారము

 

Leave A Reply

Your Email Id will not be published!