జానపదుల వివాహంలో కొన్ని ఘట్టాలు

Some Moments in a Folk Wedding

Telugu Folk Wedding Tradition : Some Moments in a Folk Wedding –

ఐరేండ్ల పూజా

పెండ్లిలో అత్యంత ముఖ్యమైన తంతు ఐరెండ్ల పూజ. కుమ్మరి ఇంటి నుండి కొత్త కుండలను తీసుకొచ్చి పూజించే విధానాన్ని ఐరెండ్ల పూజ అంటారు. కార్యక్రమాన్ని అత్యంత నిష్టగా, శ్రద్ధతో చేస్తారు. ప్రాచీన వివాహ వ్యవస్థను గమనిస్తే అన్ని కులాల కలుపుగోలుగా తోస్తుంది. గ్రామంలోని అనేక కులాలు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేస్తారు. అందుకు ప్రతిఫలంగా వీరికి అనేక కట్న కానుకలు సమర్పించుకొని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు.



జానపదుల వివాహంలో పోలు పీట

పచ్చని పందిరి అయిపోయిన తరువాత వడ్లుపోసి దానిపైన ఎత్తైన పీటను వేసి పెండ్లి కుమారుడిని దానిపై కూర్చోబెట్టి మంగళి మైలపోలు తీస్తాడు. అనగా పెండ్లి కుమారుని కాలి గోర్లు మొదలైనవి శుభ్రం చేస్తాడు. అందుగ గుంజ

అందుగ చెట్టు కాండాన్ని తెచ్చి పచ్చని పోరుక రోజున ఇంటి ముందు నాటుతారు. ఇది కళ్యాణ అభివృద్ధి మరియు క్షేమాన్ని సూచిస్తుంది. చెట్టు అంత పెద్దగా పెరిగితే కాపురం అంత చక్కగా ఉంటుందని గ్రామీణులు నమ్ముతారు.

జానపదుల వివాహంలో గంటె పుస్తెలు

పెళ్ళిలో ప్రధానమైనవి గంటెపుస్తెలు. స్త్రీకి వివాహం అయినది అనడానికి ప్రధాన సాక్ష్యం. పెళ్ళిలో ఘట్టాన్ని మాంగళ్యధారణ అంటారు. దీనిని చాలా పవిత్రంగా బావిస్తారు. దీనికి పవిత్రంగా పూజ చేసి ముత్తైదువులతో నమస్కరించి వరుడి చేత వడువు మెడలో కట్టిస్తారు. పెళ్లి అయిన తరువాత వీటిని ఎత్తి పరిస్థితుల్లోను మెడనుండి తీసివేయరు.

అందుగ గుంజ పోచమ్మ పూజ

పెళ్ళికి కొన్ని రోజుల ముందు పోచమ్మ పూజను నిర్వహిస్తారు. దీనిని ఆదివారం రోజున వేట మాంసంతో చేస్తారు. పేదవారు కోడితో చేసుకుంటారు. పూజకు గ్రామంలో అత్యంత ప్రాముఖ్యం ఇస్తారు. డప్పులు, బ్యాండ్, పరివారం, బంధువులు కలిసి మొక్కు చెల్లిస్తారు. పచ్చ పొరుక

పెళ్లి ముందు రోజును పచ్చని పోరుక అంటారు. పచ్చని పొరుక అనగా ఇంటిముందు పందిరిపై పచ్చని చెట్టు కొమ్మలని వేసి నీడ చేయడం. కాపురం కలకాలం పచ్చగా ఉండాలని దీనిని చేస్తారు. పూర్వం ఎద్దుల బండిలో అడవి నుండి పచ్చని పొరుకని తెచ్చేవారు. ప్రస్తుతం టెంట్ వేస్తూ సరిపెడుతున్నారు. కార్యక్రమంలో పాల్గొన్నవారికి భోజనం పెట్టి వారి ఇంటికి సాగనంపుతారు.

పసుపు ఇసురుడు

ముతైదువులు కొందరు కలిసి పసుపు కొమ్ములను ఇసురురాయిలో వేసి ఇసురుతారు.

 

Read More : పంచాంగ శ్రవణం

 

Leave A Reply

Your Email Id will not be published!