నమస్కారము

Namaskaram (Namaste)

Telugu Tradition : Namaskaram –

ప్రపంచ సంస్కృతులలో ఎదుటి మనిషిని గౌరవించు అతి చక్కని ముద్రగా నమస్కారము పరిగణింపబడుతుంది. గురువులు, పెద్దవారు, గౌరవనీయులు ఎదురైతే రెండు చేతులు జోడించి, తలను కొద్దిగా ముందుకు వంచి, తమ భక్తిని కటించుకొనే ప్రక్రియే నమస్కారము.

నమస్కార విధి తెలుగువారి సంప్రదా యాలలో ఒకటిగా చెప్పబడింది. నమస్కారం చేయడాన్ని శాస్త్రాలలో నాల్గు విధాలగా చెప్ప బడింది. అవి సాష్టాంగ నమస్కారం, దండ నమస్కారం, అంజలి నమస్కారం.



ప్రణామం, పంచాంగ

సాష్టాంగ నమస్కారం


మనస్సు, బుద్ధి, అభిమానం, రెండు పాదాలు, రెండు చేతులు, శిరస్సు అను ఎనిమిదింటితో చేయు నమస్కారమే సాష్టాంగ నమస్కారం. ఇందులో ఒక వ్యక్తి యొక్క శరీరంలోని అష్ట భాగాలు భూమిని తాకుతూ బోర్లా పడుకొనే మాదిరిగా దేవునికి ఎదురుగా పడుకొని నమస్కారం చేస్తారు.

దండ ప్రణామం

నేలమీద పడిన దండము (కర్రలాగా) శరీరాన్ని భూమిపై వాల్చి పరుండి కాళ్లు చేతులను చాపి అంజలి చేయుట దండ ప్రణామం.

పంచాంగ నమస్కారం

రెండు పాదాల వేళ్లు, రెండు మోకాళ్లు, తల భూమి పైనుంచి రెండు చేతులను తలవద్ద చేర్చి అంజలి చేయుట పంచాంగ నమస్కారం. ఇది ఎక్కువగా స్త్రీలు చేస్తారు.

అంజలి నమస్కారం

ఇది సర్వసాధారణమైన రెండుచేతులను కలిపి నమస్కారం అనటం. భారతదేశ వ్యాప్తంగా హిందూమత సంబంధమైన విధులు నిర్వర్తిం చేప్పుడు, మతాచార్యుల ఎదుట, భగవంతుని ముందు ప్రవర చెప్పి నమస్కరిస్తూంటారు. చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణస్య శుభం భవతి…. త్రయార్షయ ప్రవరాన్వితః శాఖాధ్యాయీ అహంభో అభివాదయే అంటూ నమస్కరించడం వైదిక విధానం. చేతి వేళ్లను చేవుల వెనుకకు చేర్చి ముందుకు కాస్త వంగిన భంగిమలో పై సంస్కృత వాక్యాన్ని ఉచ్చరిస్తారు. మనుష్యులకు నమస్కరించేప్పుడు కుడిచేయిని ఎడమచెవికి, ఎడమచేయిని కుడిచెవికి చేర్చి ప్రవర చెప్పాలి. దేవతలకు నమస్కరించాల్సి వస్తే ఎడమచేతిని ఎడమచెవికి, కుడిచేతిని కుడిచెవి వెనక్కి చేర్చి ప్రవర చెప్తారు.

 

Read More : ప్రదక్షణము

 

Leave A Reply

Your Email Id will not be published!