కనకాభిషేకము
Kanakabhishekam
Telugu Tradition : Kanakabhishekam –
9 కాని, 11 కాని బంగారపు పూవులు, తులసీదళములు, గంగ నీరు, రామేశ్వరం బావులలో నీరు, 4వ తరం ఇంటి పెద్దవారిని కూర్చో బెట్టి వెండి చిల్లుల పళ్ళెంలో తులసీ దళములు, బంగారపు పూవులు పెట్టి బ్రాహ్మణుడు మంత్రాలు చదువు తూంటే, ఈ నీటితో అభిషేకము చేయుదురు.
మనుమడు తన కొడుకును మనవ సంతానము చేత అభిషేకము ఒకరి తరువాత ఒకరు అభిషేకము ఎత్తుకుని ముందుగా ముది చేయిస్తారు. మిగిలిన వారందరూ చేయుదురు.
బంగారపు నిచ్చెన, వెండి కఱ్ఱ, గొడుగు, పాదరక్షలు, పీట, ధనము, చెంబు, గంధపుచెక్క, తులసీదళం, ఆవుదూడ – ఈ దశ దానములు నాల్గవ తరం ఇంటి పెద్ద ముదిమనవ సంతానమును పట్టుకుని పదిమంది బ్రాహ్మణులకు దానముగా ఇవ్వవలెను. ముదిమనవ సంతానము చేతుల మీదుగా ఇంటి పెద్దలకు బట్టలు పెట్టించవలెను.