శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎదురు నడుచుట

Walking in front of Lord Venkateswara

Lord Venkateswara : సాధారణంగా వివాహం సందర్భంగా కొందరు తమ కులదైవమైన వెంకటేశ్వర స్వామికి మ్రొక్కి వివాహపనులు ప్రారంభిస్తారు. వివాహానికి ముందుగానే వారు గతంలో మ్రొక్కినట్లు వేంకటేశ్వరస్వామివారికి ఎదురు నడిచి స్వామివారిని సేవించుకొంటారు. ఈ సందర్భంగా జరిగే తతంగం ఈ విధంగా సాగుతుంది.

వధువు పసుపునీళ్ళల్లో ముంచిన కండువా వల్లెవాటుగా వేసు కొంటుంది. వరుడు పసుపులో ముంచిన

వస్త్రాలను ధరిస్తాడు.

అఖండ దీపారాధన కొరకు ఒక పొంగలి, పెద్దవాళ్ళ కొరకు ఒక పొంగలి రెండు గిన్నెలలో చేయబడుతుంది.

వడపప్పు, పానకం, చలిమిడి రెండు సెట్లుగా సర్దుకోవాలి. ఒక గిన్నెలో మూడు గిద్దల బియ్యములో రెండవ

గిన్నెలో మూడు గుప్పిళ్ళు మాలక్ష్మమ్మకు పొంగలి చేయాలి.

కుటుంబంలో అందరూ తలస్నానం చేస్తారు. అప్పటి వరకు భోజనం చేయని నూతన వస్త్రాలు ధరించుకోవాలి.

మగవాళ్ళు అందరూ నామం బొట్టు పెట్టుకొంటారు.

ఒక ప్లేట్లో పానకము, వడపప్పు, చలిమిడి, పండ్లు, పూలు, కొబ్బరి కాయ వీటిని గుడికి తీసుకుని వెడతారు. ఒక

సెట్ వడపప్పు ఇంట్లో అందరికీ పంచి, రెండవ సెట్ వడపప్పు గుళ్ళో అందరికీ పంచుతారు. పెండ్లికుమారునికి

బుగ్గన చుక్క, పారాణి, నామము బొట్టు పెట్టాలి.

పెండ్లికుమార్తెకు బుగ్గన చుక్క పారాణి, కల్యాణం బొట్టు పెడతారు. ముందుగా తల్లి పసుపు నీళ్ళు చల్లుతూ

నడుస్తుంది. పెండ్లికుమారుడు పసుపు గుడ్డ కట్టిన చెంబు (హుండీ) పట్టుకోవలెను.

పెండ్లికుమారునికి తండ్రి తడి టర్కీటవల్ గుండ్రంగా చుట్టి దానిమీద ఖాళీ మూకుడు, పైన బొగ్గుల మూకుడు పెట్టి

పట్టుకుని నడిచెదరు. ప్రక్కన ఒకరు సాంబ్రాణి వేస్తూ గోవిందా! గోవిందా! అంటూ గోవింద నామాలను జపిస్తూ

నడుస్తారు.

ఎదురు నడుచుటకు బయలుదేరునప్పుడు వాకిట్లోకి రాగానే ఆడపడుచు వారుపోసి కర్పూరము వెలిగించి

హుండీకి హారతి అద్దిన తరువాత నడువవలెను.

హుండీలో డబ్బులు వడ్డించిన స్త్రీలకు బొట్టు పెట్టి పండు లేదా పటిక బెల్లమును ప్రసాదముగా ఇచ్చెదరు.

మగవారికి ప్రసాదము నిచ్చెదరు.

దారిలో ఎవరికైనా ఒళ్ళు పెరిగి స్వామి ఒంటి మీదకు వచ్చినచో పసుపు నీళ్ళు చల్లాలి. తగ్గకపోతే నాలుగు

కొబ్బరికాయలు కొట్టవలెను. అందువలన కొన్ని కొబ్బరికాయలు వెంట తీసుకుని వెళ్ళవలెను.

అలా నడుస్తూ గోవిందలు కొడుతూ వేంకటేస్వర స్వామివారి గుడికి వెళ్ళి పూజ చేయించుకొని తిరిగి వచ్చెదరు.

ఇంటి ముందుకు వచ్చిన తరువాత వారు పోసి ఆడపడుచు కర్పూరము వెలిగించి హుండీకి హారతి అద్దవలెను.

 

మెయిన్ గేట్ వద్ద ఒక గొలుసును అటు ఇటూ ఇద్దరు పట్టుకోవాలి. ఆ గొలుసు క్రిందనుండి ఇంట్లోకి రావలెను.

పెండ్లికుమారుడు హుండీని దేవుని మందిరం వద్ద ఉంచవలెను. హుండీలో వచ్చిన చిల్లర ఇంటి ఆడపడుచు 3

గుప్పిళ్ళు తీసుకోవలెను.

ఆడపిల్ల పెండ్లికి ఎదురు నడిచిన మొత్తం తిరుపతి హుండీలో వడ్డించాలి. హుండీలో వచ్చిన చిల్లరను కొత్త

చేతిగుడ్డలో ముడివేసి దేవుడి మందిరంలో పెట్టి తిరుపతి హుండీలో వడ్డించాలి.

ఎదురు నడిచి ఇంటికి వచ్చిన తరువాత వరుని పెండ్లికుమారునిగాను, వధువును పెండ్లికుమార్తెగాను

చేయుదురు.

సాధారణంగా ఈ తంతు ఈ విధంగా సాగుతుంది. కొన్ని ప్రాంతాలలో అప్పటి ఆచార వ్యవహారాలను బట్టి కొన్ని

కొన్ని మార్పులు ఉంటాయి.

 

Also read: శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపు

 

Leave A Reply

Your Email Id will not be published!