శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపు

Sri Venkateswara Swamy consecration

Lord Venkeshwara : కలియుగ వైకుంఠ నాథుడు శ్రీవేంకటేశ్వరుడు కష్టంలో కడతేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు.

ముడుపు అంటే ఏమిటి? ఎలా కట్టాలి?

వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందటం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని, ఆటంకంగా ఉన్న

నిర్మాణం పూర్తి కావాలని .. ఇలా లేదా వారికి ఉన్న వ్యక్తిగత సమస్యల నివారణ కొరకు వేంకటేశ్వర స్వామికి ముడుపు కడతారు.


శ్రీవేంకటేశ్వరస్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి పూజ చేయాలి. మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకొని, ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టి.. బట్టకి నాలుగు వైపులా కుంకుమ రాసి అందులో 11 రూపాయలు లేదా మీరు మొక్కుకున్న ధనాన్ని స్వామివారిని స్మరించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనఃస్ఫూర్తిగా భక్తిగా స్వామికి(Lord Venkeshwara) చెప్పుకుని డబ్బు పెట్టిన పసుపు బట్టని మూడు ముడులు వేసి స్వామి వారి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి,

శ్రీ వేంకటేశ్వర స్వామి(Lord Venkeshwara) అష్టోత్తరం, గోవిందనామాలు లేదా మీకు ఇష్టమైన స్వామివారి స్తోత్రాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకి కూడా హారతి ఇవ్వాలి. ముడుపు మీపని అయ్యే వరకు స్వామివారికి ముందే ఉంచాలి. కోరిక తీరాక ముడుపు తీసుకొని తిరుమలకి దర్శనానికి వెళ్లి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి హుండీలో వేయాలి. ఇది భక్తితో, నమ్మకంతో చేసిన వారికి వారి వారి కోరికలు నెరవేరగలవు అని చెప్పబడుతుంది.

Also Read : మాలక్షమ్మ చెట్టు వద్ద వేడుక 

Leave A Reply

Your Email Id will not be published!