శ్రీ వెంకటేశ్వర స్వామికి అఖండ దీపారాధన వేడుక
Lord Venkateshwara - Akhanda Deeparadhana Ceremony
Lord Venkateshwara – Akhanda Deeparadhana Ceremony
కావలసిన వస్తువులు : మూకుడు, నూనె 250 గ్రా., ఎండుకొబ్బరి చిప్ప, మల్లుగుడ్డ అరమీటరు, నాము, తిరుచూర్ణము, సాంబ్రాణి.
Lord Venkeshwara : మగపిల్లవాని పెండ్లి అయిన తరువాత శ్రీ సత్యనారాయణ స్వామివారి వ్రతము చేసుకున్న తరువాత శ్రీవెంకటేశ్వరస్వామి వారికి అఖండ దీపారాధన చేయుదురు. ఇంటిలో పూజా మందిరంలో మట్టిమూకుడుకు పసుపురాసి, కుంకుమబొట్లు పెట్టి, ఆవునెయ్యి, నువ్వుల నూనె మూకుడులో వేసి, వెంకటేశ్వరస్వామి వారిని మదిలో తలుస్తూ, నూతన దంపతులు అఖండ దీపారాధన వెలిగించాలి.
ఈ సందర్భంగా ఐదుగురు బాలదాసులు అనగా పది సంవత్సరముల లోపు మగపిల్లలకు ముఖాన గోవింద నామములు పెట్టి, తుండ్లు, కట్టించి వారిని గోవిందునిగా భావించి వారిచేత గోవింద నామం జపింపచేయాలి. పిల్లలకు కొత్త టవలు పండు తాంబూలము ఇవ్వవలెను. ఐదుగురు ముత్తైదువులకు బాలదాసులకు విందు భోజనము ఏర్పాటు చేయాలి. ఆ తరువాత ముత్తైదువులకు జాకెట్టు వస్త్రము, పసుపు, కుంకుమ, తాంబూలం ఇవ్వవలెను.
ఒక మూకుడులో నిప్పులు తయారుచేసి పెండ్లికొడుకు పట్టుకొనగా, పెండ్లికూతురు సాంబ్రాణి వేసుకుంటూ భోజనములు వడ్డించిన తరువాత గోవింద నామం జపిస్తూ వారిముందు తిరగాలి. అనంతరం అందరూ భోజనము చేయవచ్చును.