కొమ్మునృత్యం

Koya Tribes Kommu Dance

Telugu Dance Tradition : Koya Tribes Kommu Dance

కొమ్మునృత్యం గోదావరి తీర ప్రాంతాలలో నివసించే గిరిజనుల సంప్రదాయ నృత్యం. నృత్యం ప్రదర్శించే కోయలు వారి భాషలో నృత్యాన్ని పెరియకోక్ ఆట అని అంటారు. కోయ భాషలో పెరియకోక్ అంటే దున్నపోతు కొమ్ములు అని అర్థం.

 

దున్నపోతు కొమ్ములు ధరించి, దున్నలు కుమ్ముకునే రీతిలో నృత్యం చేస్తారు కాబట్టి నృత్యం కొమ్ము నృత్యంగా వ్యవహరింపబడుతున్నది. వీరు ఉపయోగించే వాద్యండోలు కొయ్య”. చైత్రమాసంలో భూదేవి పండుగను ఘనంగా చేసుకుంటారు కోయలు.

పండుగ సమయంలో పురుషులు అడవులలోకి వేటకి వెళ్ళడం పరి పాటి. వేట ముగించుకుని విజయవంతంగా ఇంటికి చేరుకున్న సంద ర్భంగా కోయలు దున్నపోతు కొమ్మలు, నెమలి ఈకల గుత్తిని పొదిగిన బుట్టను తలకు అలంకరించుకుని రంగు రంగుల బట్టలు వేసుకుని ఆయా సంప్రదాయ వాద్యాల్ని వాయిస్తూ చేసే నృత్యమే కొమ్ము నృత్యం. ఇది తెలుగువారి సంప్రదాయ నృత్యాలలో ఒక భాగమైంది.

 

Read More : తప్పెటగుళ్ళు

Leave A Reply

Your Email Id will not be published!