బుడబుక్కలవాడు

Budabukkala

Telugu Traditional : Budabukkala –

గతంలో బుడబుక్కల వాళ్లు శ్మశానం సమీ పంలో నివసించే వాళ్లు. వీరు కాటికాపర్లు. ఏడా దిలో ఒక్కసారి మాత్రమే గ్రామాల్లోకి వచ్చేవాళ్లు. సంక్రాంతి పండుగకు ముందు కేవలం వారం పది రోజుల పాటు మాత్రమే వీళ్లు ఊళ్లోకి వచ్చేవాళ్లు.

తమ చేతిలో డమరుకం తరహాలోని వాయిద్యాన్ని వాయించుకుంటూ ఇల్లిల్లూ తిరిగి ఇంటికి సంబంధించి, ఇంటి సభ్యులకు సంబంధించి భూత భవిష్యత్తు వర్తమానాల గురించి రాగయుక్తంగా వినిపించేవారు.


అప్పట్లో బుడబుక్కల వారి జోస్యాన్ని ప్రజలు ఎంతగానో విశ్వసించే వారు. శ్మశానంలో కొలువుండే రుద్రుడే వీరి నోట తమ జాతకాన్ని పలికిస్తారని నమ్మేవారు. జోస్యం తమకు అనుకూలంగా ఉన్నా..ప్రతికూలంగా ఉన్నా.. ఇంటి యజమాని సదరు బుడబుక్కల వాడికి సంతృప్తి కలిగేలా ధాన్యాన్ని ముట్టజెప్పేవారు.

వాద్యాన్నిబట్టే వారికి పేరు

వీరి చేతిలోని డమరుకం చేసే శబ్దం డబుక్కు డబుక్కు అంటూ వినిపించేది. అదే, వ్యావహారికంలో బుడబుక్కు బుడబుక్కు అని.. డమరుకాన్ని డబుక్కు బుడబుక్కు అన్న శబ్దం వచ్చేలా వాయించే వారిని బుడబుక్కల వాళ్లు అని పిలిచే వారు.

జంగమదేవరలే వీరు

నిజానికి వీరు జంగమ దేవరలు. ఒంటినిండా రకరకాల వర్ణాల వస్త్రాలను ధరించేవారు. మొలకు పంచె కట్టు ఉండేది. తలకు వర్ణరంజి తమైన వస్త్రంతో పాగా చుట్టుకునే వారు. కళ్లకు ఇంతలేసి కాటుక పూసేవారు. నుదుటన భస్మాన్ని దట్టించేవారు. అసలు వీళ్లని చూడగానే పిల్లలకు భయమేసేది. అందుకే తల్లిదండ్రులు మారాం చేసే పిల్లల్ని బుడబుక్కలోడికి పట్టిస్తా జాగ్రత్త అంటూ బెదిరించి దారిలోకి తెచ్చేవారు. వీరు శ్మశానానికి సమీపంలోనే గుడిసె వేసుకొని నివసిస్తూ ఉండేవారు. మారిన కాలంతో పాటే.. వీరి వృత్తిగత జీవితమూ మారిపోయింది. ఇప్పుడు కాటికాపర్లు ఎవరూ ఊళ్లలోకి రావడం కానీ.. జోస్యాలు చెప్పడం కానీ చేయడం లేదు.

 

Read More : జంగం దేవరలు

Leave A Reply

Your Email Id will not be published!