విజయరధశాంతి వేడుక

Vijaya Ratha Shanthi Ceremony

Telugu Traditional Event : Vijaya Ratha Shanthi Ceremony –

ఎక్కువ వయస్సు ఆరోగ్యంగా జీవించే పెద్దలకు ఆయా వయస్సులు దాటి సమయంలో వచ్చే దోషనివారణకు కార్యక్రమాలు నిర్వహిస్తారు.

78 సంవత్సరాలు నిండిన దంపతులను ఉదయాన తలార స్నానం చేయించి పెండ్లి కొడుకును, పెండ్లికూతురుని చేయుటము, మంగళ స్నానము. పురోహితుడు అంకురార్పణ చేసి గణపతి హోమము మృత్యుం జయ హోమము చేయుదురు. కొందరు శ్రీ సత్య న్నారాయణస్వామి వారి వ్రతము చేసుకొందురు.



వివాహంలో జరిగే వేడుకగానే తలంబ్రాలు పోసుకొనుట, బిందెలో ఉంగరములు వేయుట, దండలు మార్చుకొనుట, మొదలగు వేడుకలు చేస్తారు. సాయంకాలము ఊరేగింపుగా వేడుక మండపమునకు బయలుదేరి వెళ్ళెదరు. కొడుకులు కోడళ్ళు, దంపతులిద్దరికి పాదపూజచేసి నూతన వస్త్రాలు పెట్టవలెను. శుభ కార్యమునకు వచ్చిన అతిధులకు భోజనముతో పాటు స్తోమతను బట్టి బహుమతులు కూడా పంచెదరు. ఆనాడు బ్రాహ్మణులచే జపము చేయిం చుకుని దశదానములు బ్రాహ్మణులకు ఇవ్వవలెను.

 

Read More : భీమ రధశాంతి వేడుక

Leave A Reply

Your Email Id will not be published!