వెన్నెల భోజనముల వేడుక
Vennela Bhojanamula Veduka
Telugu Tradition – Moon Light Celebration : ఈ వేడుక అమ్మాయికి తొమ్మిదోనెల వచ్చిన తరువాత దశమినాడు పౌర్ణమి లోపు ఏదో ఒక రోజు ఈ వేడుక జరుపుకోవాలి. స్వీటు : పంచదారతో చక్కెర పొంగలి, కోవా, కాజుబర్ఫి, హల్వా పిండి ముక్కలు, గడ్డి జున్ను, హల్వా, సగ్గుబియ్యం లేక సేమియా పాయాసం హాటు : కొబ్బరి అన్నము, ప్రైడ్ రైస్, కట్టెపొంగలి, దదోజనము. కూరలు : క్యాబేజి కూర, కాలీఫ్లవరు పసుపు లేకుండా వండవలెను. చట్ని : కొబ్బరి పచ్చడి, ఉల్లిపాయ పెరుగు చట్ని.
పులుసు : పెసరకట్టు పసుపు లేకుండా, సగ్గుబియ్యం వడియాలు. మేడపైన గానీ, ఓపెన్ స్థలములో గానీ, భోజనములు ఏర్పాటు చేయాలి. భోజనాలలో అందరిముందుర అన్ని తినుబండారాలు వడ్డించిన తరువాత ఒకసారి అన్ని లైట్లు ఆపివేయాలి. అప్పుడు చంద్రుని వెన్నెల తెల్లటి, చల్లటి వెలుతురు భోజనముల పైనపడును. అందరు తెలుపు డిజైను చీరలు కట్టుకుందురు. కడుపుతో ఉన్న అమ్మాయి పక్కన మరొక గర్భిణి ధరించిన అమ్మాయిని భోజనము చేయునప్పుడు కూర్చుండపెట్టుదురు. ఆ సమయంలో ఆమెకు ఒక ఉయ్యాల కానుకగా ఇవ్వాలి. ఆ వేడుక సమయములో కడుపుతో ఉన్న ఆడపిల్లలను బంతిలో వరుసగా కూర్చుండపెట్టవచ్చును. ఊయలలు అందరికి ఇవ్వవచ్చును. లేనిచో ఐదుగురికి అయినా ఇవ్వవచ్చును. స్తోమతను బట్టి వెండివి లేక చెక్కవి ఏవైనా ఇవ్వవచ్చును.