Telugu Tradional Dance : Veeranatyam –
ఆంధ్రదేశంలో వీరశైవం విరి విగా ప్రచారములోనున్న కాలములో ఆలయములందు దేవదాసీల నృత్యా రాధనయే కాక శివభక్తుల తాండవ పద్ధతికిచెంది వీరావేశము కలిగించు నాట్యము కూడ చేసేవారు. వీరరస ప్రధానమైన రచనలను, ఖడ్గములను చదువుతూ వీరొక చేత ఖడ్గమును, మరొక చేత డాలును ధరించి నృత్య మాడేవారు. దీనినే వీరనాట్యము అని అంటారు. ఈ నాట్యము యుద్ధ నాట్యములను పోలి ఉంటుంది.
వీరుల కొలుపు
ముఖ్యముగా పల్నాటి యుద్ధమున వీరస్వర్గ మలంకరించిన ఆంధ్ర యోధుల సంస్మరణార్థము ఈ వీరుల కొలుపు ప్రారంభమైనది. ఇందులో ప్రదర్శింపబడే ఆరాధనా నృత్యములు కూడా తాండవ పద్ధతికి చెంది నట్టివే. కార్యమపూడి, మాచెర్ల, గురజాల మున్నగు చోట్ల పల్నాటి తాలుకా లోని ఈ వీరుల కొలుపులు ఈనాటికీ ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నాయి.