వరపూజ (ఎదురుకోలు)

Varapuja (confrontation)

Telugu Marriage Tradition : Varapuja (confrontation) –

కాశీయాత్ర విరమించుకొని వరుడు కళ్యాణ మండపానికి వస్తుంటే కన్యాదాత మేళ తాళాలతో, పానకం బిందెలతో, కొత్త బట్టలతో ఎదురేగి స్వాగతం పలుకుతాడు. మగ పెళ్ళి వారు విడిదికి చేరుకోగానే, అప్పటికే వారికొరకు ఎదురు చూస్తున్న ఆడ పెళ్ళి వారు, “ఎదురు కోలుపలికే ఆచారం సరదాగా, సందడిగా జరుపుకునే మరో వేడుక. విడిదిలో ఏర్పా ట్లన్నీ పూర్తి చేసి (సబ్బులు, పేస్టులు, బకెట్లు, తుండు గుడ్డలు, వేడి నీళ్లు లాంటివి) ముందు (హాలులో) భాగంలో పెద్ద తివాచీ లాంటిది పరిచి ఎదురు చూస్తుంటారు ఆడ పెళ్ళి వారు.

 



మేళ తాళాలతో ఆహ్వా నించి కాబోయే అత్తగారు, మామగారు, వారి సమీప బంధువులు ఎదురు కోలలో భాగంగా, విడిదిలోకి ప్రవేశించే ముందర కాళ్లు కడుక్కోవడానికి మగ పెళ్ళి వారందరికీ నీళ్లిస్తారు. పెళ్ళికొడుకు పనిని బావమరిదితో చేయిస్తారు. కాళ్లు కడగడమనేది రెండుమూడు పర్యాయాలు జరిపే వ్యవహారం.

పానకం వరునికి ఇచ్చి రుచి చూపించి తరువాత బంధువులందరికీ ఇస్తారు. తర్వాత అందరికీ కాఫీపలహారాలిచ్చి మర్యాదలు చేసి, స్నానాలు ముగించుకొని సిద్ధంగా వుంటే, భోజనాలకు తీసుకెళామంటారు. లేదా అక్కడే ఏర్పాటు చేస్తారు.

 

Read More : పెళ్లికొడుకును – పెళ్లి కూతురును చేయడం

Leave A Reply

Your Email Id will not be published!