వైకుంఠ పాళీ

Vaikuntha Pali

Telugu Traditional Games : Vaikuntha Pali –

IN and పరమ పద పర. ము H వైపక్షము 10 | 40 ILF వాడు అవకాచులు ఒనరి ADS 101 103 104 104 100 #*#MI వడం ఆష M2 15 12 TL చం సహాయము SE యోగము లోకము వరకాయుడుకు 27 సారము ఆవిష్ణు మునందు B 19 మరవదనము

వైకుంఠపాళీ తెలుగు వారికి ప్రత్యేకమయిన ఆట. వైకుంఠపాళీ పటాన్ని పరమపద సోపానమటమని కూడా వ్యవహరిస్తారు. ఈ పటంలో 132 గళ్ళు ఉంటాయి. గళ్ళు రకరకాలయిన బొమ్మలతో అంకెలు వేసి ఉంటాయి. గళ్ళకు దిగువన పాములు, ఏనుగులు ఉంటాయి.


అది పాతాళమనీ, ఏనుగులు అష్టదిగ్గజాలనీ పైనున్న భూమి (అంకెలు ఉన్న గళ్ళ)ని ఎనిమిది ఏనుగులూ మోస్తున్నాయనీ హిందువుల విశ్వాసం. ఆటపేరువైకుంఠపాళి”. కాని ఎక్కువ మందిపాముల పటంఅని అంటుంటారు వాడుక భాషగా. ఆటను ఎందరైనా, ఎవరైనా ఆడుకోవచ్చును.

ఆట ఆడేవారు ఒక్కొక్కరు ఒక్కొక్కరకం ఆటకాయలను ఏర్పరచుకోవాలి. ఆట ప్రారంభించడానికి ముందు ఆట ఆడేవారందరూ వైకుంఠపాళి పటమునకు ఎదురుగా కూర్చొని, నాలుగు పందెపు గవ్వలతో పందెం వేస్తూ ఆడతారు.

అష్టాచెమ్మా ఆట ఆడే విధంగానే, కన్ను, రెండూ, మూడు, అష్టాచెమ్మా అనే పందాలు ఆటలో చలామణిలో ఉన్నాయి. అందులో వలెనే ఆటలో కూడా పైపందెం వేస్తారు.

ఉదాహరణకు 16 (సుగుణం) గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు నిచ్చెన సాయంతో 28 (సాలోక్యం) గడిని చేరుకుంటుంది వైకుంఠపాళీ పటంలో 16, 19, 30, 41, 52, 63, 65, 74, 79, 87 సంఖ్యలుగల గళ్ళల్లో నిచ్చెనలు ఉన్నాయి.

పందానికైనా ఆటకాయ ఆయా గళ్ళలోనికి వచ్చినప్పుడు అక్కడవున్న నిచ్చెన సాయంతో పైగడికి చేరుకోవచ్చును. ఉదాహరణకు 63 ధాతృత్వం గడిలో ఉన్న నిచ్చెన దగ్గరకు ఆటకాయ వచ్చినప్పుడు నిచ్చెన సాయంతో 83 గడి అయిన యశస్సు చేరుకుంటుంది.

అలా చేరుకోవడాన్నినిచ్చెన ఎక్కడంఅంటారు. పుణ్యం చేసిన వారికి పుణ్యం దక్కి నిచ్చెన ఎక్కడం జరిగిందంటారు. అప్పుడు పై పందెం వేసుకునే అవకాశం ఇస్తారు. పై పందెం వల్ల మళ్ళీ నిచ్చెన ఎక్కినట్లయితే మళ్ళీ మరో పై పందెం వేసుకోవచ్చును. ఇలా ఆట కొనసాగుతూ ఉంటుంది.

పటంలో నిచ్చెనలు ఉన్నట్లుగానే అక్కడక్కడ పాములు కూడా ఉన్నాయి. ఆటకాయ నిచ్చెన పాదం దగ్గరికి వచ్చినప్పుడు పైకి వెళ్ళినట్లే . పాము తల దగ్గరికి ఆటకాయ వచ్చినప్పుడు పాము కరిచి ఆటకాయ పాముతోక చివరి వరకూ కిందికి దిగి పోతుంది. అంటే ఉదాహరణకు 26 గడిలో ఉన్న పాము కరచినప్పుడు దాని తోక ఉన్న 3 గడికి వచ్చి, అక్కడ ఉన్న చిన్న పాము మూలంగా ఆటకాయ పాతాళం చేరుకుంటుంది. ఇట్లు పాము తోక దగ్గరకు రావడాన్నిపాము మింగడంలేకకరవడంఅంటారు.

ఇక 106 గడిలో ఉన్న పెద్ద పాము మింగిందంటే ఆటకాయ ఒకేసారి 1 గడిలోనికి వచ్చి పడుతుంది. చివరకు 121 గడిలో ఉన్న పామును తప్పించుకొని 122 గడికి ఆట కాయ చేరుకున్నట్లయితే పుణ్య లోకానికి చేరినట్టే. అక్కడి నుండి చివరి వరకూ వెళ్ళి తిరుగు ముఖం పట్టి మధ్యనున్న దైవ స్వరూపాన్ని చేరు తుందో పందెం పడినప్పుడే ఆటకాయ దైవ సన్నిధికి చేరినట్టు చెప్ప వచ్చును.

దైవ సన్నిధికి చేరినట్టు వైపూ వైపూ ఉన్న వారిని ద్వార పాలకులనీ, వారు దైవ దర్శనం కాకుండా అడ్డగిస్తూ ఉంటారనీ, అందు వల్ల వాళ్ళ చుట్టూ తిరిగిన తర్వాతనే దైవ దర్శనం అవుతుందని ఒక నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజున రాత్రి జాగరణ చేసే సందర్భంలో తెలుగువారు సాధారణంగా ఆట ఆడుతూ ఉంటారు.

 

Read More : ఫకీరు వేషం

Leave A Reply

Your Email Id will not be published!