వధువు కాళ్ళకి మట్టెలు
Vadhuvu Kallaku Mettelu
Telugu Marriage Tradition : Vadhuvu Kallaku Mettelu –
వధువుకి వరుడు పెళ్లి రోజున కాలి రెండవ వేలుకి మట్టెలు తొడగడం మన ఆనాదిగా వస్తున్న సంప్రదాయం. స్త్రీ ఆభరణాలు అన్నీ సామాన్యంగా యోగ శాస్త్రంలోని నాడులుకి సంభందించి ఉన్నాయి. స్త్రీలు చేతికి వేసుకొనే గాజులు, కాలి మట్టెలు రెండు కూడా సంతానా బివృద్ధికి, సుఖ ప్రసవం నాటికి అనుకులించే నాడులనూ సున్నితంగా నొక్కుతు ఉంటాయి.
అందువల్ల మన పూర్వికులు వధువుకి కాళ్ళ మట్టెలు ఆపాదించారు. ఈ మట్టెలు వధువుకి వివాహిత అని చెప్పే మరో గుర్తు. వివాహతంతులో వధువు పాదాన్ని రోకలిపై ఉంచి వరుడు ఆమె కాలి వేలుకి మెట్టలు తొడుగుతారు. వీటినీ ఒక్కక్క ప్రాంతంలో ఒక్కో రకంగా ధరింపచేయటం జరుగుతుంది.