Telugu Traditional Games : Tokkudu Billa –
ఆనాటి అమ్మాయిలకెంతో ఇష్ట మైన ఆట ఇది. ఈ ఆటను ఇద్దరు ఆడవచ్చు. ముందుగా పక్కపక్కనే ఉండే నాలుగు నిలువు గళ్ళు, రెండు అడ్డగళ్ళు గల దీర్ఘ చతురస్రాకార గడులను గీయాలి. తరువాత గడుల బయట బాలికలు నిలుచోవాలి.
ముందుగా ఒక బాలిక చేతిలో బిళ్ళను ముందు గడిలో వేసి కాలు మడిచి మిగతా ఎనిమిది గడులను దాటించి బయటకు తీసుకురావాలి. తరువాత రెండవ గడి, తరువాత 3,4,5,6,7,8, ఇలా అన్ని గడులను దాటించాలి. ఏ సమయంలో కూడా కాలు గాని, బిళ్ళగాని, గడుల గీతలను తాకరాదు.
గడులన్ని అయిపోయాక కాలి వేళ్ళ మధ్య బిళ్ళను బిగించి పట్టుకుని దాన్ని కుంటి కాలితో ఎనిమిది గడులను గెంతి రావాలి. అలాగే కాలి మడం మీద పెట్టి గడులను దాటాలి. తరువాత తలపై పెట్టుకొని దాటాలి. తరువాత అర చేతిలో, ఆపై మోచేతిపై , భుజం పై, పెట్టుకొని అన్ని గడులను దాటాలి. తరువాత బిళ్ళను గడుల అవతల వేసి కళ్ళు మూసుకొని అన్ని గడులను దాటాలి. ఇవన్నీ దాటితే ఆట వారిదే అవుతుంది.