పిల్లల స్నానం తరువాత

Things To do After a Baby Shower

Telugu Tradition : Things To do After a Baby Shower – స్నానం ముగించేటప్పుడు పాత్రలో అడుగున కొన్ని నీళ్ళు ఉంచి, చెంబులో కొన్ని నీళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడు సార్లు తిప్పుతూ క్రింద చెప్పినట్టు అంటారు.

జోత పోత జోన్నారి పోత

(బాబు/పాప పేరు చెప్పి

చూసిన వాళ్ళంతా రోత రోత 

(అంటూ పిల్లల చేతిని దండం పెడుతున్నట్టు దగ్గరగా తీసుకొని వచ్చి) రాజరాజేశ్వరుడికి జేజ, తిరుపతి వెంకన్నకు జేజ, అలమేలు మంగమ్మకు జేజ, పద్మావతికి జేజ, ముక్కోటి దేవతలకు జేజ, ముక్కోటి దేవతలకు జేజ, ముక్కోటి దేవతలకు జేజ అనాలి.

 



లేదా క్రింద విధంగా అంటూ చేతిలో నీళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ తిప్పుతూ అనాలి

శ్రీరామ రక్షా నూరేళ్ళు ఆయుష్షు

నేలబండ ఆట

ఆటను ఎంత మందయినా ఆడవచ్చును. ముఖ్యంగా 6 నుండి 13 వరకు వయసు గల బాల బాలికలు ఆటను ఆడతారు. మొదటగా ఒకరిని దొంగగా నిర్ణయిస్తారు. ఆట ఆడు ప్రదేశ మందు మట్టి ప్రదేశము (నేల), రాతి ప్రదేశము (బండ) ఉండవలెను. ముందుగా దొంగని నేల కావాలో బండ కావాలో కోరుకోమంటారు. ఉదాహరణకి దొంగ నేల కోరుకున్నచో, దొంగ నేల మీద, మిగిలిన వారందరు బండ మీద ఉంటారు. బండ మీద ఉన్నవారు నేల మీదకి వచ్చినీ నేలంతా కరిగిపోతంది..” అంటూ దొంగని ఆట పట్టిస్తూ ఉంటారు. దొంగ బండ మీదకి వెళ్లకుండా నేల మీదకి వచ్చిన వాళ్లని పట్టుకోవటానికి ప్రయత్నించవలెను. ఇదియే దొంగ యొక్క ముఖ్య లక్ష్యం. దొంగకి చిక్కిన వారు దొంగ స్థానమును భర్తీ చేస్తారు. ఆట చిన్న పిల్లలకు బాగా ఇష్టమైన ఆట.

 

Also Read : పురిటి స్నానము వేడుక

Leave A Reply

Your Email Id will not be published!