సోది

Sodhi

Telugu Tradition : Sodhi –

సోదోయమ్మ సోది, సోదడగ రండమ్మా సోది” “సోది చెబుతాం, సోది చెబుతాంఅని మిట్ట మధ్యాహ్నం వేళ చిన్న తార తంబుర ఒకదాన్ని చేత్తో మీటుతూ ఆశృతిలో గొంతుకలిపి పాటలా మాటలు పలుకుతూ సోదికత్తెలు వీధుల్లో తిరుగుతుంటారు.

సోది చెప్పించుకునే స్త్రీ చేటలో మూడు సోలల బియ్యం పోసి ఎదుడుగా కూర్చొని చెయ్యి చాపుతుంది. సోదికత్తె ఆమె చేయి స్పృశిస్తూ, ఆమెకు సంతానం, పిల్లలు, పెళ్ళిళ్ళు, ప్రయాణాలు, భార్యా భర్తల సంబంధం, ఆర్ధిక పరిస్థితులు, గతించిన విషయాలు, పూర్వం మరణించిన పెద్దల కోర్కెలు వాగౌరణితో చెప్పుకుపోతుంటుంది.



ఇలా ఎన్నో విషయాలు ఎడతెగని .

మగవాళ్ళని పుంజులనీ, ఆడవాళ్ళని పెట్టనీ, పుంజంటే గడ్డం, పెట్టంటే బొట్టు అని పలికే సంజ్ఞా పరిభాష వీళ్లదే. సోదిగత్తె తను సోది చెబుతూనే చెప్పించుకునే వాళ్ల నుండి తనకు కావలసిన సమాచారం రాబట్టుకు చెబుతుందనేది ప్రతీతి.

ఏమైనా వీళ్ళు కూడా ఆడవాళ్లని బాగా ఆకట్టుకొని బియ్యం శేర్ల కొద్దీ దండుకుపోతుంటారు. ఇందులో ఎక్కువగా పనిచేసేది పరేంగిత జ్ఞానం. సోది చెప్పించుకొనుట అనే అలవాటు లేదా లక్షణం తెలుగు వారిలో ఒకప్పుడు ప్రబలంగానే ఉండేది. ప్రస్తుతం సోది చెప్పేవాళ్ళుగానీ, చెప్పించుకునేవారిగానీ అంతగా కనిపించటం లేదు.

 

Read More : చిలక జోస్యం

Leave A Reply

Your Email Id will not be published!