పాములాళ్ళు
Snakes
Telugu Tradition : Paamulallu (Snakes) –
పాములవాళ్ళలో మగవాళ్ళు పెద్ద పాగా చుట్టుకొని, పాములబుట్ట నెత్తిన పెట్టుకొని, నోటితో ఆనబకాయబుర్రతో చేసిన బూర నాగస్వరం ఊదుతూ ప్రతి గుమ్మం దగ్గరా బుట్ట దింపి, మూత తెరచి పొమునాడిస్తుంటే అందరూ వినోదంగా చూసి బియ్యం మొదలైన వాటిని వేస్తారు.
అలా ఆడించేటప్పుడు పాము అప్పుడ ప్పుడు నాలుకబయట పెట్టి బుస్సుమంటుంది. అతను ఒక వేరు ముక్క వేళ్ళతో పట్టుకొని దాని మూతిమీద పెట్టగానే అది చప్పగా చల్లబడి తలదించేసుకుంటుంది. ఆది తెల్ల విసరని చెబుతాడు. అలాంటివి తన దగ్గర ఇంకా ఉన్నాయని తీసి చూపించి, రెండేసి దోసిళ్ళ బియ్యానికి ఒక్కో వేరుముక్కచొప్పున అమ్ముకుంటారు.
ఆ అమ్మేవి మామూలుపుల్ల ముక్కలే. అతని చేతిలో దికూడా పచ్చి వస ముక్కట. దాని వాసనకి తాచుపాము రోషంపోయి నీరస పడిపోతుందట. ఇదీ గమ్మతు. ఈ విధంగా పాముల వాళ్ళు తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలలో భాగమైపోయారు.