తలమీద శిఖ
Sikha - Baby's First Cut
Telugu Tradition : Sikha – తలమీద శిఖ : పుట్టు వెంట్రు కలు తీసే సమయంలో, తల మీద శిఖలను ఉంచటం పద్దతిగా ఉంటోంది. తమ కుటుంబం ప్రవర అనుసారం మూడు శిఖలను కానీ, అయిదు శిఖలను కానీ ఉంచు తారు.
వశిష్ఠ గోత్రానికి చెందిన వారు తల మధ్యలో ఒక శిఖను; అత్రి, కాశ్యప గోత్రాల వారు తలకు రెండు వైపులా రెండు శిఖలను; భృగు గోత్రానికి చెందిన వారు అసలు శిఖలు లేకుండా; ఆంగిరస గోత్రీకులు ఐదు శిఖలను ఉంచు కోవాలని శాస్త్రం. కానీ, ఇప్పుడు శిఖలను ఉంచుకునేవారు ఎవరైనా ఉంటే, వారు కేవలం ఒక శిఖనే ఉంచుకుంటున్నారు.