Telugu Hindu Tradition : Samkuramayya
సంక్రాంతి నెలలో సంకురుమయ్య అనే దేవదూత భూమి మీద పర్యటిస్తారు అని ప్రతీతి. ఈ సంకురుమయ్య ప్రతి సంవత్సరం ఒక్కొక్క వాహనం పై వస్తాడు అని పంచాంగకర్తలు భావిస్తారు. ఈ సంకురుమయ్య ఆగమన ఆధారంగా ఆ సంవత్సర ఫలితాలను గణిస్తారు.
ఉదాహరణకి ఎద్దు వాహనం పై వస్తే ఆ ఏడాది పంటలు బాగా పండుతాయి అని, అగ్ని మీద వస్తే అగ్ని ప్రమాదాలు సంభవిస్తాయి అని, నర వాహనంపై వస్తే నరులకి అనగా మానవులకి కొద్దిపాటి అరాచకాలు సంభవిస్తాయని ఫలితాలు ఇలా ఇలా.. గణిస్తారు.