Telugu Tradition : Samartha Snanam – ఈ సమర్త స్నాన మును ఎనిమిదవ రోజు రాత్రికి ఎనిమిది గంటలకు స్నానము చేయించవలెను. నువ్వుల నూనె వంటికి రాసి, నలుగు పెట్టి తల స్నానము చేయించాలి.
అనంతరం ఐదు నిమిషముల తరువాత మరల తలస్నానము చేయించ వలెను. దీనినే దొంగ స్నానము అందురు. 7,9,11 రోజులలో ఉదయమే ఇలా నలుగు పెట్టి స్నానము చేయించవలెను. 11వ రోజు పురోహితుడు వచ్చి పుణ్యవచనము చేయించెదరు.
2వ సమర్త 9వ రోజుతో, 3వ సమర్త 7వ రోజుతో, 4వ సమర్త 5వ రోజుతో, మూడు ముట్లు కన్నె ముట్లని 4వ రోజు దూరముగానే ఉంచి 5వ రోజు ఇంట్లోకి తెస్తారు.