సహస్ర చంద్ర దర్శన వేడుక

Sahasra Chandra Darshan Ceremony

Telugu Traditional Event : Sahasra Chandra Darshan Ceremony –


83 సంవత్సరాల 4 నెలలు పూర్తి అయితే 1000 చంద్రోదయములు చూసిన పుణ్యం ఆనాటికి కలుగుతుంది. దీనినే సహస్ర చంద్రోదయము అని అంటారు. అనగా 84 సంవత్సరంలోకి అడుగు పెట్టడమంటే! వేయి పౌర్ణమిలను చూచినవారగుదురు. వేయి చంద్రదర్శనములు చేసిన వారిగా గుర్తించి, వారికి వేడుక జరిపించెదరు.

 

సమయంలో అభిషేకము, పూజలు, జపములు, హోమములు జరుపుకొందురు. సత్యన్నారాయణ స్వామి వారి వ్రతము చేసుకొనవచ్చును. బంగారపు నిచ్చెన, వెండివి కర్ర, గొడుగు, తులసిదళము, పాదరక్షలు, పీట, ధనము, చెంబు, గంధపు చెక్క, ఆవుదూడ, దశదానములు బ్రాహ్మణులకు దానమిస్తారు.

దంపతులకు ఉంటే దంపతులకు, లేక ఒకరిగా ఉంటే ఒక్కరితో వేడుక జరుపుకుంటారు. ఆనాటి ఉదయమే తలస్నాన మాచరింపజేసి నూతన వస్త్రాలు ధరింపచేయాలి. తరువాత కుర్చీలో కూర్చుండబెట్టి కుమా రులు, కుమార్తెలు అల్లుళ్ళు, కోడళ్ళు వారి పిల్లలు, మనవలు, ముది మనవళ్ళు అందరూ ఆయనకు పాదపూజ చేసి నమస్కరించి, వారి ఆశీర్వాదం తీసుకోవాలి. తరువాత దగ్గరలో ఉన్న గుడికి పోయి అభిషే కము చేయించాలి. స్తోమత కల్గినవారు వేడుకను గొప్పగా జరిపించు కుంటారు. బంధుమిత్రులకు విందు భోజనాలు ఏర్పాటుచేసి గొప్ప కాను కలు పంచుతారు.

కొబ్బరికాయ కొట్టడంలో అంతరార్థం

క్షుద్రదేవతలకు నోరున్న జంతువుని బలి యిస్తారట. సాత్విక దేవతలకు నోరులేని జంతువుని బలి ఇస్తారట. కొబ్బరికాయ మొక్క వస్తుంది గనక అది ప్రాణే అని, కాయలోని నీరు శరీరంలో రక్తంలాంటిదని, గుంజు మాంసంలాంటి దని, పై పెంకు చర్మంలాంటిదని, అందువల్ల ఒక కొబ్బరికాయను అర్పించడమంటే ఒక జంతువును బలివ్వడమే అని కొందరి భావన.

 

Read More : విజయరధశాంతి వేడుక

Leave A Reply

Your Email Id will not be published!