అద్దె ఇల్లు – గృహప్రవేశం
Rented House - Gruha Pravesam
Telugu Hindu Tradition : Rented House Gruha Pravesam
కావలసినవి : సీతారాముల పటము, లక్ష్మీ, వినాయకుడు పటము, పసుపు, కుంకుమ, అక్షింతలు, కర్పూరము, వత్తులు, పత్తి, నూనె, కుంది, గంట, హారతి ఇచ్చునది, ఆకులు, వక్కప్యాకెట్టు, పూలమాల, విడిపూలు, నిమ్మకాయలు, చాకు, గిన్నె, గరిట, పళ్ళెము, కొబ్బరికాయలు 2, పొయ్యి,మసిగుడ్డ, పాతగుడ్డ, బియ్యము, బెల్లము, జీడిపప్పు, నెయ్యి, యాలుకులు, ఉప్పు, పెరుగు, కందిపప్పు, కవ్వము, మంచినీళ్ళు, దిండ్లు, దుప్పట్లు, కట్టుకొను వస్త్రములు, చాపలు
భర్త రాముని పటము, భార్య పేపరు ప్లేట్లు, గ్లాసులు, మంచినీరు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పెరుగు, కవ్వము, ఉప్పు ఒక ప్లేటులో ఉంచి పట్టుకోవాలి.
పురోహితుడు సూచించిన సమయమునకు మొదటి గుమ్మము వద్ద కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయ రెండు చెక్కలుగా కోసి, గుమ్మము మీద పసుపు, కుంకుమ, అక్షింతలు చల్లి, నిమ్మ చెక్కలకు కుంకుమ అద్ది గుమ్మమునకు రెండువైపులా పెట్టవలెను.
తరువాత ఒక గిన్నెను పసుపు కుంకుమలతో అలంకరించి, పాలుపోసి వాటిని పొంగేవరకు మరగించాలి. తూర్పు ఈశాన్యములో శుభ్రపరచి అలంకరించి దేవుని పటము పెట్టి పూజచేసుకొనవలెను.
పొంగలి నైవేద్యము పెట్టవలెను. పిలిచిన అతిధులకు కాళ్ళకు పసుపు రాసి, నుదుట కుంకుమ బొట్టు పెట్టి, పండు తాంబూలము ఇవ్వవలెను. పెరుగు, ఉప్పు, కవ్వము ఆ ఇంట్లో ఉంచవలెను.
3/4 డబ్బా, 3 గిద్దలు, 3 గుప్పిడులు, అవసరమును బట్టి పొంగలి చేయాలి. అతిథులకు వసతిని బట్టి భోజన సదుపాయాలు చేసుకోవాలి.