Telugu Traditions : Purnakumbham –
పూర్ణ కుంభం (నిండు కుండ) అనేది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధికారిక చిహ్నము. ఈ కుంభం లేదా కలశము అనేది సాధారణంగా నీటితో నింపబడి ఉండి, పైభాగాన ‘టెంకాయ‘ (కొబ్బరి కాయ)ను కలిగి, చుట్టూ మామిడాకులచే అలంక రింపబడి వుంటుంది.
పూర్ణ కుంభాన్ని ఎలా తయారు చేస్తారు
దీని కొరకు సాంప్రదాయికంగా ఇత్తడి కుండను ఉపయోగిస్తారు, అది అందుబాటులో లేనప్పుడు రాగి లేదా మట్టి కుండలు కూడా ఉపయో గిస్తారు. ఈ కుండను కలశం లేదా కుంభం అనికూడా అంటారు. కొన్నిసార్లు ఈ కుంభాన్ని బియ్యంతో నింపుతారు, తెల్లని లేదా ఎర్రని Hopkins Studios దారాన్ని ఈ కుండమెడకు లేదా మొత్తం కుండకు చుడతారు. మామిడాకు లతో ఈ కుండ ముఖం వద్ద వృత్తాకారంలో అలంకరిస్తారు. కొన్నిసార్లు టెంకాయను తెల్లటి లేదా పసుపు బట్టతో కప్పుతారు. ఈ విధంగా పూర్ణకుంభం తయారవు తుంది. దీనిని సాంప్రదాయికంగా పవిత్ర మైనదిగా భావిస్తారు, మంత్రోచ్ఛారణలతో తయారుచేస్తారు. దీనిని శుభసూచకంగా భావించి శుభకార్యాలలో ఉపయోగిస్తారు. ఉదాహరణకు పెండ్లి, గృహ ప్రవేశం, రోజువారీ ప్రార్థనలు మొదలగునవి. దీనిని ముఖ ద్వారాలవద్ద ‘స్వాగత సూచకంగా‘ కూడా ఉంచుతారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార చిహ్నంలో ప్రభుత్వం మార్పులు చేసింది. చిహ్నంలో ఇప్పటి వరకు ‘పూర్ణ కుంభం‘ ఉండేది. అయితే, అది తప్పని ప్రభుత్వం తేల్చింది. పూర్ణ కుంభం కాదు పూర్ణ ఘటం అని ప్రకటించింది.
ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ANDHRA TERADESH आंध्र प्रदेश సత్యమేవ జయతే !