పురిటి స్నానము వేడుక
Puriti Snanam cermony
Telugu Tradition : Puriti Snanam cermony : అమ్మాయి చేతికి పండు తాంబూలము, అందించి ఒక చిన్న సైజు స్టూలుకు నాలుగు వైపులా పసుపు ముద్దలు పెట్టాలి. స్టూలు పై అమ్మాయిని కూర్చుండ బెట్టాలి. ఒక కండువా లేక లుంగి ఎడమ భుజము మీదుగా….కుడిచేతి కిందకు రానిచ్చి ముడివేయుదురు. దీనిని కొలు వస్త్రము అంటారు.
పురిటిస్నాన విధానము
అమ్మాయికి నువ్వుల నూనె రాసి నలుగు పెట్టి తలంటి పోయాలి. పసుపు ముద్దలతో ఒళ్ళు తోమాలి. ఒక ముద్ద తరువాత ఒకటి, వేడినీళ్ళలో పసుపు, వేపాకు కలపాలి. మామూలు కాన్పు అయితే చిన్న తెపాళతో నీళ్ళు పొట్టమీదకు విసిరి పోస్తారు.
స్నానము అయిన తరువాత కొలువస్త్రము పిండి, తెలుపు రంగు చీర కట్టించాలి. గిద్ద బియ్యము, పెసర పప్పు కలిపి అన్నము వండాలి. దీనిని పులగం అంటారు. ఒక పళ్ళెములో విస్తరాకు వేసి పులగము అన్నము మూడు చిన్న ఉల్లిపాయలు, నల్లకారము, బెల్లపుముక్క పండు తాంబూలము ఆ విస్తరిలో పెట్టి ఆ ప్లేటును దొడ్లో పెట్టవలెను. బాలింత స్నానము అయిన తరువాత కొల్లువస్త్రము చాకు పట్టుకుని గ్లాసులో మజ్జిగ పోసి అందులో వేపాకు మండ వేసి ధారగా వారు పోస్తూ సూర్య నారాయణ మూర్తి ఈ మజ్జిగ చుక్కలు తీసుకొని పాలచుక్క మాకివ్వు స్వామీ! ఏటా బాలింత ఏటా శూలింత అంటూ సూర్యభగవానునికి నమస్కారము చేయించవలెను. ఈ విస్తరిలో ఉంచిన అన్నం చాకలికి యివ్వవలెను.
బాబు లేక పాపకు స్నానము చేయించిన తరవాత వడ్లజల్లెడ కాని, చాటలో కాని మెత్తని తెలుపుచీర వేసి పరుండ పెట్టవలెను. పుణ్యాహ వచనము అయ్యేదాకా 13, 15, 17, 19 రోజులలో నలుగు పెట్టి వరస స్నానము చేయించాలి. తలస్నానము అవసరములేదు. 21 రోజున నలుగు పెట్టి తలస్నానముచేసి పొంగలి వండాలి. దేవునికి దీపారాధన చేసి పొంగలి నైవేద్యము పెట్టి పూజచేయాలి. ఆ విధంగా చేసిన తరువాత పూర్తి పురుడు పోయినట్లు. నెలలోపల ఒకసారి బాబు లేక పాపని గుడికి తీసుకువెళ్ళి స్వామివారి దర్శనం చేయించాలి.
బిడ్డ స్నానము అయిన తరువాత తల్లి స్నానముచేసి సూర్యునకు నైవేద్యము పెట్టి నమస్కరించే దాక బాబును చూడరాదు. ప్రసవించిన తరువాత 3, 5, 9 రోజులలో ఏదో ఒక రోజు ఒక కాటన్ చీర మామగారు కోడలుకు ఇవ్వవలెను. ఆ రోజు ఆ చీర కట్టుకొనవలెను. తరువాత ఈ చీరెను బాబుకు పక్క చీరగా వాడుకొనవచ్చును లేక బాలింతకట్టు కొనవచ్చును. మామగారు లేని వాళ్ళు భర్తచేతితో ఇవ్వవలెను. 2 ఆరవరోజే కీలకం
బ్రహ్మదేవుడు 60 సంవత్సరములు ఆయుషు ఇవ్వగలను కాని ఆరవ రోజు నా చేతకాదు అంటాడు. ఐదవరోజు సాయంత్రం 5, 6 గంటల నుండి ఇలా అనుకొనవలెను. బ్రాహ్మణుడి కూతురు మాదిగవాని పెళ్ళాం ఎవరమ్మ ఏరుదాటి మా ఇంటికి రాకమ్మ అని. ఆరవ రోజు ఉదయం వరకు అనుకుంటూ ఉండాలి. ఆరవ రోజు మాత్రం బాబును ఏ కొంచెము సమయము కూడా ఒంటరిగా ఉంచరాదు.
హస్త, మృగ, అనూరాధ, రోహిణి, రేవతి, అశ్వని, ఉత్తర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, స్వాతి నక్షత్రాలు, ఆది,మంగళ, గురువారాలు మంచివి. స్నానం 11, 13, 15, 17, 19 రోజులలో చేయించాలి.
Also Read : జాతకర్మ