పుంసవనం

Pumsavana - Woman's Pregnancy

Telugu Tradition : Pumsavana – Woman’s Pregnancy : 

గర్భాదానం తరువాత చేయు సంస్కారమే పుంసవనము. ‘పుంసవనంఅంటే మగబిడ్డ జననానికి ఆత్రపడటం అర్థం.

స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కుమారుడు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపే సంస్కారం పుంసవ నం. గర్భిణీ స్త్రీ రోజంతా ఉపవాసముంటుంది. రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి రసాన్నిహిరణ్యగర్భ:…” అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలోఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్య వంతుడైన కుమారుడు పుడతాడని నమ్మకం.

 

ఒకప్పటి సమాజమున పుత్రోదయమునకు నాటి పరిస్థితుల దృష్ట్యా గణనీయ స్థానము ఉండేది. తండ్రి రుణ విమోచనముకే కాకుండా యుద్ధాదులందు పురుషులు పాల్గొనే విధానము బట్టి కూడా పురుష సంతానమునకు అగ్రతాంబూలము ఉండేది.

ఒక వేళ స్త్రీ సంతతి కలిగిననూ మహోత్తర పురుషులు వీరికి కలుగుదుగాక అనే ఆశాభావము కూడా ఇందు కనుపించుచున్నది.

పుంసవనము చేయవలసిన తిధులు – విదియ, తదియ, పంచమి, షష్టి, సప్తమి, అష్టమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, పౌర్ణమి అనుకూలమైన తిధులు.

పుంసవనము చేయదగు నక్షత్రములు – హస్త, మూల, శ్రవణం, పునర్వసు, మృగశిర, పుష్యమి, రోహిణి, పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర, స్వాతి, అనురాధ, అశ్వని.

పుంసవనము చేయదగు వారములు  – సోమవారం, బుధవారం, గురువారం, శుక్రవారం
పుంసవనము చేయదగులగ్నములు 

వృశ్చిక, సింహరాశులు తప్ప మిగిలిన లగ్నములన్నీ పుంసవనము నకు పనికివస్తాయి.
సప్తమ నవమరాశులు, శుద్ధిగగల లగ్నమును నిర్ణయించుకొని పుంసవనము చేసినచో సంస్కార ఫలము పొందుదురని చెప్పబడుచున్నది.

పుంసవన సంస్కారం చేయు విధానము – ప్రాతః కాలమున స్వాధర్మ విదిత విధులు పూర్తిచేసిన తరువాత గణపతి పూజ, పుణ్యాహవచనం గావించి, పుంసవన సంస్కారము కొరకు సంకల్పించవలెను. భార్యను తన కుడి వైపు కూర్చోబెట్టుకొని, రక్షాబంధనము (కంకణము) కట్టవలెను.

ఎనిమిది సంవత్సరములు గల కన్యచే మట్టి చెట్టుకు గల జంట పండ్లు ఉన్న కొమ్మ చిగురును నూరించి ఒక తెల్లని కొత్త వస్త్రములో రసమును వడగట్ట వలెను.

గర్భవతిని పడమర ముఖముగా కూర్చోబెట్టి శిరస్సును తూర్పునకు ఉండునట్లు తలను పై కెత్తి భర్త రసమును కుడి చేతి బొటను వ్రేలుతో భార్య కుడి ముక్కు రంధ్రమున పిండవలయును. స్త్రీమూర్తి రసమును ఉమ్మి వేయరాదు.

సందర్భములో క్రింది అర్థముగల మంత్రములను చదువుతారు. పది మాసములు భరించి, శిశువును కనుటకు పది వ్రేళ్ళతో నిన్ను అంతటా తాకుచున్నాను. సోమరసము ఎట్లు జారుచున్నదో, సముద్రము గాలిచే కదలునో అట్లే నీ గర్భము నుండి శిశువు బయటకు వచ్చుగాక, ఆయుస్సు, వర్చుస్సు, కీర్తి, పరాక్రమము, ఆహారమును తినుటయందు పటుత్వము కలిగియుండుగాక. శిశువు అపాయము లేనిదై నీకు అపాయము కలుగకుండుగాక.

మిత్ర, వరుణ, అగ్ని, వాయువు అశ్వని దేవతలు మొదలైన దేవతల ప్రార్ధన మంత్రాలతో భర్త భర్య యొక్క నాభి ప్రదేశమును తాకవలయును. సమయమున భర్త భార్యతో మనకు పుట్టబోవు సంతానము మంచి ఆయుషు, వర్చస్సు, కీర్తి, పరాక్రమము, పటుత్వము కలిగిన వాడు కావలెను అని చెప్పి దేవతలను ప్రార్ధించవలెను.

అంతేకాక ప్రసవ సమయములో శిశువునకు కానీ నీకు కానీ ఎటు వంటి అపాయము కలగకుండా ఉండుగాక అని భార్యతో చెప్పి దేవతలను ప్రార్ధించవలెను.

తరువాత ఆవుపాలు, పెరుగు, నెయ్యి సమభాగములలో కలిపి అందు ఒక గోధుమ గింజను రెండు మినప గింజలను ఉంచి మనకు కలుగబోవు సంతానము పురుష సంతానము కావలెను అను భావనతో భార్యచే త్రాగించవలను.

స్త్రీ గర్భము దాల్చిన ప్రతిసారి విధి అవసరమా?

మొదటి సంతానమునకు మాత్రము 4 నెలలో ఖచ్చితముగా చేయవలెను అని చెప్పబడుతుంది.

 

Also Read : శ్రావణ పట్టి

Leave A Reply

Your Email Id will not be published!