Telugu Marriage Tradition : Perantalu Worship –
పెళ్లి జరిగే రోజున ప్రత్యేకంగా పేరంటాలను పిలిచి వధువుతో లేదా వరుడితో కలిపి కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తారు. ఇది కూడా చాలా ముఖ్యమైనదే. వివాహం కోసం ఏర్పాటు చేసిన విందుతో పోలిస్తే ఇది ప్రత్యేకంగా ఉంటుంది.
అరిసెలు, సున్నుండలు, జంతికలు ఇలా కొన్ని రకాల పిండివంటలు వండి వారికి వడ్డిస్తారు. వడ్డన పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు చేతుల మీదుగానే జరుగుతుంది. తినడం పూర్తయిన తర్వాత ఎంగిలి ఆకులను వధువు లేదా వరుడు ఎత్తుతారు. ఇలా చేస్తే పెద్దల ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. ఆ తర్వాత పేరంటాలకు తాంబూలం అందిస్తారు.