పెళ్లికొడుకును – పెళ్లి కూతురును చేయడం

Pellikodukunu - Pellikuturunu Cheyadam

Telugu Marriage Tradition : Pellikodukunu – pellikuturunu cheyadam –

పెళ్ళికి ముందర ఒక మంచి రోజున గానీ, స్నాతకంఅంకు రార్పణల రోజున గానీ పెళ్ళికొడుకునుపెళ్ళికూతురును చేయడం ఆచారం. మంగళ స్నానాలతో ఉదయం కార్యక్రమం మొదలవుతుంది. వధూవరుల ఇళ్లలో, ఉదయం తెలతెలవారుతుండగానే, మంగళ వాయి ద్యాల మధ్య ఇంటి ముందర మామిడి ఆకులతో తోరణం కట్టే కార్యక్రమం ముందుగా జరుగుతుంది. ఇంటిముందు తాటాకు పందిరి వేయించి, దానిని రంగు రంగుకాగితాలతో అలంకరించాలి. తరువాత పందిరి కింద శుభ్రం చేసి కళ్ళాపితోగానీ, మంచినీటితో గాని తుడిచి దానిపై బియ్యపు పిండితో అందమైన ముగ్గును వేసి పసుపు కుంకుమలతో అలంకరించాలి.

దానిపైన రెండు పీటలు వేసి, పీటలపైన తెల్లని వస్త్రము వేసి అక్షతలు చల్లవలెను. తరువాత మేళ తాళాలతో గుమ్మానికి, పందిరికి మామిడి తోరణాలు కట్టాలి. హారతి పళ్ళెము అక్షతలు, కుందులు, నూనె, అగ్గిపెట్టి అన్ని సిద్ధముగా ఉండే విధంగా చూడాలి.

అమ్మాయి కాళ్ళకు పసుపు పూసి, ఎడమ బుగ్గన చుక్క పెట్టి తాంబూలంలో ఆకులు, వక్కలు, అరటిపండ్లు అన్ని జంటగా ఉంచి, ఆమె చేతిలో పెట్టి తూర్పు ముఖంగా పీటపై కూర్చోబెట్టాలి. స్నానము చేయనవసరములేదు. వధువుకు, కన్యా దాత దంపతులకు, తోటి పెళ్ళి కూతురుకు (వధువు సొంత చెల్లెలు గాని, వరుసకు చెల్లెలు గాని), తెల్లవారక ందే, ముతైదువలు బొట్టు పెట్టి, మాడుపై నూనె అద్ది, హారతిచ్చి, మంగళ స్నానాలకు సిద్ధం చేస్తారు. పెండ్లికూతురునకు ఎడమవైపున తోడు పెండ్లికూతురును కూర్చోబెట్టాలి. తరువాత బంధువుల చేత, ముత్తైదువల చేత హారతులు పాడించి వారిచేత ఆశీర్వాదాలు పొందాలి. అక్షింతలు వేసి హారతి కళ్ళకు అద్ది, ఇద్దరికి నూతన వస్త్రాలు పెట్టవలెను.

మాడుకు, చేతులకు నెయ్యి రాసి, శనగ పిండిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి అది కూడా చేతులకు, ముఖానికి రాస్తారు. సరదాసరదాగా రోలుకు రోకలికి ఐదుపోగుల దారమునకు పసుపురాసి తమలపాకు లేక పసుపుకొమ్ము ముడివేసి రెండు తోరణములు కట్టెదరు. రోటిలో ఐదు పసుపుకొమ్ములు వేసి ఐదు మంది ముత్తైదువులుచే పసుపు కొట్టించవలెను. పసుపు మెత్తగా కొట్టి తలంబ్రాల బియ్యములో కలుపవలెను. ఒక పీట మీద తడి టవలువేసి పసుపుతో గౌరమ్మను చేసి తమలపాకులో పెట్టి పీటమీద పెట్టాలి. తరువాత గౌరమ్మకు గొలుసు వేసి గౌరీపూజ చేయాలి. పూజ చేసిన తరువాత పీట మీద మినప పిండితోకానీ శనగ పిండితోకానీ ఐదు లేక తొమ్మిది మంది ముత్తైదువులచే వడియాలు పెట్టించాలి.

తొమ్మిది లేక పదకొండుమంది ముత్తైదువులకు అమ్మాయిచేత గాజులు ఇప్పించాలి. అమ్మాయికి కుడిచేతికి 11 గాజులు, ఎడమచేతికి 10 గాజులు తొడిగిం చాలి. రెండు చేతులకు కలిపి 21 గాజులు ఉండాలి. తలస్నానం చేయించిన తరువాత నూతన వస్త్రాలు ధరించి కాళ్ళకు పారాణి, బుగ్గన చుక్క తలలో పూలు, చేతిలో తాంబూలాలతో పీటలమీద కూర్చో బెట్టాలి. అలానే వరుడికి, తల్లితండ్రులకు, తోటి పెళ్ళికొడుకుకు (వరుడి సొంత తమ్ముడు గాని, వరుసకు తమ్ముడు గాని) కూడా జరుగుతుంది. పెళ్ళి కుమారుని చేయగానే పెళ్ళి కుమారునిలో సాక్షాత్తు నారాయణుడు ప్రవేశిస్తాడు.

అందుకే పెళ్ళి కుమారునికి పెళ్ళికళ వచ్చింది అంటారు. అటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన పెళ్ళికుమారుడు చేసే ప్రతిపని లోనూ అతనికి సహాయడపడటానికి తోడు పెళ్ళికొడుకు పనికివస్తాడు అని చెబుతారు. ముందుగా అబ్బాయిని పెండ్లి కొడుకుగా చేసిన తరువాత అమ్మాయిని పెండ్లి కూతురుగా చేయుట మంచిది. విషయంలో కనీసము 10 నిమిషాలు అయినా తేడా పాటించాలి. మంగళస్నానం తర్వాత నూతన వస్త్రాలు ధరింపచేసి కల్యాణ తిలకం దిద్దుతారు. కాళ్లకు పసుపు రాసి, పారాణి అద్దుతారు.

 

Also Read : కాశీ యాత్ర

Leave A Reply

Your Email Id will not be published!