పెళ్లి చూపులు
Pelli Choopulu Process
Telugu Marriage Tradition : Pelli Choopulu Process : హిందూ వివాహాల్లో పెళ్ళి చూపులు ఒక ప్రధానమైన ఘట్టం. కాబోయే వధువు వరుడు ఒకరినొకరు చూసుకునే తొలిఘట్టం.
ఇరువైపు బంధువులు కలుసుకొని, ఒకరి గురించి ఒకరు తెలుసుకునే సందర్భం ఇది. హిందు మత సాంప్రదాయం ప్రకారం పెళ్ళి అయ్యొంత వరకు అమ్మాయి తన మెట్టినిల్లు చూడకూడదని హిందువులు గాఢంగ నమ్ముతారు, కనుక పెళ్ళిచూపులు అమ్మాయి వాళ్ళ ఇంటి వద్దే జరుగు తాయి. పెళ్ళి కొడుకు తరుపువారు ఐదుగురు అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారు.
అమ్మాయిని తయారు చేసి అబ్బాయికి చూపిస్తారు. తరువాత ఇద్దరికి అమ్మాయికి అబ్బాయికి నచ్చితే పెద్దవారు కట్న, కానుకలు మాట్లాడతారు. వధూవరులు పరస్పరం నచ్చాక, ఇరువురి ముఖ్య బంధువులు వరుడి ఇంట్లో సమావేశమవుతారు.
పరస్పర సంప్రదాయాలు, కుటుంబ పద్ధతులు, ఆచార వ్యవహారాలు చర్చించుకుంటారు. వరకట్న నిషేధం లాంటివి అమల్లో వున్నప్పటికీ, సాంప్రదాయ బద్ధంగా, వధూవరుల తలిదండ్రులు కట్న కానుకలు, ఇచ్చి పుచ్చుకోవడాలు, లాంఛనాలు, ఆభరణాలు లాంటివి మాట్లాడుకున్న తరువాత, అన్నీ కుదిరాక, నిశ్చితార్థపు తేదీ నిర్ణయించుకుంటారు.
పెండ్లి చూపులకు అనువైన రోజులు, నక్షత్రములు, తిథులు
సోమ, మంగళ వారములు కాకుండా; భరణి, కృత్తిక, ఆర్థ, ఆశ్లేష, పుబ్బ, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, పూర్వాభాద్ర నక్షత్రములు కాకుండా; చవితి, షష్ఠి, అష్టమి, ద్వాదశి, అమావాస్యలు కాకుండా; వర్జ్య దుర్ము హర్తములు లేకుండా, శుభగ్రహాల యందు పగటి సమయమున పెండ్లిచూపులు ఏర్పాటు చేయవలెను.