పట్టు వస్త్రములు ధరించుట
Pattu Vastralu
Telugu Traditional wear : Pattu Vastralu –
హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి మొదలుకుని ఎటువంటి పూజాది క్రతువులు అయినా పట్టు వస్త్రధారణ ఆడవారు, మగవారు కూడా ధరించాలి. ఆడవారికీ పట్టు వస్త్రాలకీ అవినాభావ సంబంధం ఉంది. రక రకాల రంగుల్లో, ఎన్నో విధాల పట్టు వస్త్రాలు, చీరలు, మనకెప్పుడూ అందుబాటులోనే ఉంటాయి. పట్టు వస్త్రధారణ, సమాజంలో ఉన్నత స్థితిని, ఐశ్వర్యాన్ని కూడా సూచిస్తుంది.
అయితే, పట్టు వస్త్ర ధారణకు సంబంధించి ఏమైనా ఇతర కారణాలు ఉన్నాయా? ధర్మ శాస్త్రం, ఆధునిక శాస్త్రం కూడా చెబుతోంది ఏమిటంటే, మన చుట్టూ, జీవించి ఉన్న ప్రతీ ప్రాణి చుట్టూ, ఓరా అనబడే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుందని, అది మన యొక్క శరీర, మానసిక స్థితులని బట్టి మారుతూ ఉంటుంది అని చెప్పింది.
పట్టు వస్త్రాలు ధరించినప్పుడు ఈ ఓరా ఏంతో శక్తివంతంగా, కాంతివంతంగా మారి, చుట్టూ ఉన్న అత్యున్నతమైన అనుకూల శక్తినీ ఆకర్షించి, మన శరీరంలో ప్రసరింప జేసేలా చేస్తుందట. అందుకే, పవిత్ర కార్యాచరణల్లోనూ, పూజాది క్రతువులు చేసేడప్పుడు, గుడికి వెళ్ళేడప్పుడు, ఆడవారినీ, మగవారిని కూడా, పట్టు వస్త్రాలు ధరించమని, ఇలా ఉండటం మన ధర్మం అని చెప్తారు.