పసుపు కొట్టుట

Pasupu Kottuta

Telugu Marriage Tradition : Pasupu Kottuta – పెండ్లి పనులు మొదలు పెట్టుటకు మంచిరోజు చూసి పసుపు కొట్టవలెను. రోకలికి, రోలుకు, నాల్గువైపులా అరచేతి సైజులో పసుపు పూసి, ఐదు కుంకుమ బొట్లు పెట్టాలి. విధంగానే రోకలికి కూడా పసుపు పూసి, కుంకుమబొట్లు పెట్టాలి. తరువాత ఐదుపోగుల దారమునకు పసుపురాసి తమలపాకు తోరము ముడివేసి రెండింటికి కట్టవలెను. ముందుగా ఐదుగురు ముత్తైదువులకు కాళ్ళకు పసుపు రాసి రోటిలో ఐదు పసుపు కొమ్ములు వేసి వారిచే పసుపు కొట్టించవలెను.

 

 

 

పసుపు కొమ్ములు మెత్తగా నూరి తలంబ్రాలు బియ్యములో కలపవలెను. ముత్తైదువులకు ముఖాన కుంకుమ బొట్టు పెట్టి పండు తాంబూలములు, వారికి ఇవ్వవలెను. సందర్భంగా తరువాత ఒక చాటలో బియ్యము పోసి ఐదుగురు ముత్తైదువులచే బాగు చేయించవలెను. పెండ్లి కూతురుకు కొత్త చీర కొనిపెట్టవలెను. తరువాత రోజు నుండి ఇంటికి రంగులు వేయించుట మొదలైన అన్ని పెండ్లి పనులు చేయవచ్చును

 

Also Read : అంకురారోపణము

Leave A Reply

Your Email Id will not be published!