పాణిగ్రహణం

Panigrahanam

Telugu Marriage Tradition : Panigrahanam :

కొందరు పాణిగ్రహణమే వివాహంలో ముఖ్యమైనదని చెబుతారు. అందుకే వివాహానికి పాణిగ్రహణం పర్యాయపదమైనది. ఇంతకు పూర్వం వరుడు వధువు చేతిని పట్టుకొని అగ్నిహోత్రుని వద్దకు ఆమెను తీసుకొని వెళతాడు. కానీ ఇప్పుడు వధువు వరుని హస్తాన్ని పట్టుకొని జీవితాంతం అతన్ని అనుసరించి సంతానాన్ని, సౌభాగ్యాన్ని పొంది తన స్త్రీత్వాన్ని సార్థకం చేసుకుంటుంది.

వరుడు వధువు యొక్క తిరగవేసి ఉన్న కుడి అరచేతిని, తన బోర్లిం చిన కుడి అరచేతితో పట్టుకుంటాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఇద్దరూ కావాలంటే బ్రొటన వ్రేలు, మిగిలిన వ్రేళ్ళు కలిపి పట్టుకోవాలి. వధువు తన చేతిని అందుకుంటున్నప్పుడు వరుడు క్రింది మంత్రాన్ని చెప్పి ఆమెకు చేతిని అందించాలి.

 

 


గృబ్లామి తే సుప్రజాస్వాయ హస్తం
మయా పత్యా జరదష్టిర్యథా సః

భగో అర్యమా సవితా పురని
ర్మహ్యం త్వా దుర్గార్హపత్యాయ దేవాః|| 

నా పెద్దల లాగానే నేను కూడా మంచి సంతానం కోసం నిన్ను పాణిగ్రహణం చేస్తున్నాను. భగుడు, అర్యముడు, సవిత అనే దేవతలు నా గృహస్తాశ్రమం కోసం నన్ను గృహిణిగా చేస్తున్నారు.

ఏతి ప్రదిశః సర్వా దిశః అనుపవమానః హిరణ్యహస్త ఐరమ్మసృత్వా మన్మనసం కృణోతు || దశదిశలను మెరుపులతో సత్త్వశక్తితో, ప్రకాశంతో వ్యాపించే సరస్వతీ దేవి రూపాలు బంగారు చేతులతో నా ధ్యానంలో నిలబడాలి.

అప్పుడు వధువు విధమగా ప్రతిజ్ఞ చేయును. “ఆర్యపుత్ర ! సౌభాగ్యాభివృద్ధి నాశించి నేను నీ పాణిని గ్రహించుచున్నాను. పత్నినగు నాతో వార్ధక్యము వరకు ప్రసన్నతతో జీవింపుము. నేటి నుండి నన్ను, నీవు, నిన్ను నేను ద్వేషింపక ప్రేమతో వర్ధిల్లుదుముగాక. గృహమునందలి సమస్త కార్యములు, ఉత్తమ సంతానము, ఐశ్వర్యము, సౌఖ్యము అభివృద్ధి పొందుచుండుగాక. హే భద్రపురుష పరమాత్ముని కృపవలన నీవు నాకు లభించితివి. నీ హృదయము, ఆత్మ మనస్సులను ప్రియాచరణమగు నట్టి నీ కర్మలను నేను ధరించుచున్నాను. ఏకాగ్రచిత్తుడవై నీవు నా నీ మాటలను వినవలసినది. నేటి నుండి పరమాత్మ నిన్ను నాకు ఒసగెను. నూరు సంవత్సరములు నాతో సుఖింపుముతరువాత దంపతులు ఇద్దరు హోమగుండము చుట్టూ ప్రదక్షణ చేయుదురు.

 

Read More : బ్రహ్మ ముడి

Leave A Reply

Your Email Id will not be published!