ఫకీరు వేషం

Pakeeru veesham

Telugu Traditions : Pakeeru veesham –

ఫకీర్లు ముస్లిం కులంలో ఒక తెగ. వీరు అల్లాను సంస్మరిస్తూ, అల్లాకెనాం జపిస్తూ ఇంటింటికీ తిరుగుతూ, ముస్లిములను ఆశీర్వదిస్తారు. వీరు ఒక పెద్ద కంజీరాను చేతిలో ధరించి, తలకు పెద్ద తలపాగా చుట్టీ, మెడలో ఫకీరు పూసలు ధరించి, పొడుగాటి లాల్చీలను ధరించి, మొలకు గళ్ళ లుంగీలను ధరిస్తారు. ప్రతి జట్టుకూ ఇద్దరు ముగ్గురు వుంటారు. మధ్యలో పాటకుడు పాట పాడుతూ వుంటే మిగిలిన ఇద్దరూ అల్లాకేనాం అంటూ వంత పలుకుతారు.


పాడి పంటల్ సల్ గుండాలి….అల్లాకేనాం

తల్లి పిల్లల్ సల్ గుండాలి….అల్లాకేనాం తల్లి కొడుకుల్ సల్ గుండాలి….అల్లాకేనాం హిందూ ముస్లిం లంతా….అల్లాకేనాం
వారు హేకం కావాలండి….అల్లాకేనాం

అంటూ పాడుతూ, మధ్య మధ్య రక్తి కొరకు కర్రతో చేయబడ్డ, ఒక రకమైన కిర్రు శబ్దం వచ్చే దానిని చేతిలో ధరిస్తారు.
కొన్ని ప్రాంతాల్లో ఫకీరు వేషం వేసిన వ్యక్తి విధంగా ప్రవర్తిస్తాడు.

ప్రేక్షకుల్లోంచి ఒకరిని పిలిచి ఫకీరు ఇలా జోస్యం చెబుతాడు. అతని చెయ్యి చూస్తున్నట్లు నడిస్తూమీరు తలంచిన కార్యం తప్పక అవుతుంది. మీ కుడికంట్లో భాగ్య రేఖ వుంది. ఎడమ కంట్లో లక్ష్మి వుంది. తలచిన తలపు, కోరిన కోర్కెలు ఇక కొనసాగుతాయి. వశీకరణ రేఖ వుంది. ధాన్య రేఖ వుంది. ధనరేఖ వుంది. మీలో మంచి దానగుణం ఉంది. మంచి ఆలోచనలు ఉన్నాయి.

ఒక జంగం వచ్చినా, ఒక జోగి వచ్చినా, ఒక ఫకీరు వచ్చినా దాన ధర్మాలు చేద్దామని మనస్సులో మీకు ఉంది. ఇదిగో హుస్సేన్ హుస్సేన్ బారాబాహి మాం. ఒక రాత్రి నాకు పీరు కనిపించాడు. నాటి నుండి తిననివ్వడు, ఆకలి కానివ్వడు, దేశ దేశాలంట త్రిప్పుతుంటాడు. జోస్యాలు చెప్పమంటాడు. వెండిముట్ట వద్దన్నాడు, రాగిపుచ్చుకోవద్దన్నాడు, బంగారమైతే పుచ్చుకోమన్నాడు. అంచేత మీరు బంగారము ఇస్తే నాకు అభ్యంతరం లేదు తీసుకోవడానికి అని ముస్లిం యాసతో మాట్లాడుతుంటే తెలుగు యాసకూ అంతర్గతమైన అతని కోరిక చెప్పే తీరుకూ నవ్వువస్తుంది. అతని మాటలు వినేవారు అతనికి తృణమో, పణమో సమర్పించుకొంటారు.

హైస్కూలు కాలేజీ విద్యార్థులు వారి వారి వార్షికోత్సవాలలో కళారూపాన్ని ప్రదర్శిస్తూ వుంటారు. కళారూపాన్ని ఆంధ్రప్రజా నాట్య మండలి, హిందూ మత సామరస్యం కొరకు ఉపయోగించి ఆంధ్ర ప్రజలలో విశేషంగా ప్రచారం చేశారు.

Read More : భోగం మేళాలు

Leave A Reply

Your Email Id will not be published!