ఓణీలు – పంచులు వేడుక

Onilu - Panchalu Ceremony

Telugu Tradition : Onilu – Panchalu Ceremony : ఈ వేడుక సాయంత్రం వేళ చేస్తే చాలా బాగుంటుంది. నిర్ణయించిన ముహూర్తం రోజున ఉదయం తలస్నానం చేయించి, ఉతికిన వస్త్రము ధరింపచేసి దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి, అభిషేకం చేయించి స్వామివారి ఆశీస్సులు పొందాలి.

అవసరమైన వస్తువులు

స్వీటు, హాటు, పండు, ఆకులు, వక్క, బంగారపు వస్తువు, అతిథులకు పంచిపెట్టు సామాగ్రి మొదలగునవి. ముందుగా అమ్మాయిని అలంకరించి పండు, తాంబూలం చేతిలో ఉంచి వేడుకకు ఏర్పాటుచేసిన వేదికపై ఉన్న కుర్చీలో కూర్చుండబెట్టవలెను. తరువాత ముత్తయిదువులు అక్షింతలు వేసి హారతి ఇవ్వవలెను.

 



తరువాత మేనమామ, అత్త కలిసి లంగా, ఓణి, జాకెట్టు, తాంబూలం ఇవన్నీ ఒక పళ్ళెంలో చేర్చి అమ్మాయి చేతిలో ఉంచి అక్షింతలతో ఆశీర్వ దించాలి. తరువాత అమ్మాయి తల్లి, కుమార్తెను కుర్చీలో నుండి లేవదీసి, మేనమామ ఇచ్చిన నూతన వస్త్రములను ధరింపచేసి మరల అలంకరణ కుర్చీలో కూర్చుండబెట్టాలి.

తరువాత ఇద్దరు ముత్తైదువులు అమ్మాయి తలపై అక్షింతలు వేసి హారతి పాట పాడి హారతిని కళ్ళకు అద్ది పాపను ఆశీర్వదించాలి. వేడుక తిలకించడానికి వచ్చిన బంధుమిత్ర సపరివారం కూడా అక్షింతలు వేసి ఆశీర్వదిస్తారు చూసేవారికి వేడుక చాలా సరదాగా ఉంటుంది. వేడుకకు వచ్చిన అతిథులకు విందు భోజనం ఏర్పాటు చేయించాలి. తరువాత ఒక కవరులో స్వీటు, హాటు, తాంబూలము, పండు, సామాను వేసి ఇవ్వవలెను.

పంచెలు

పంచె, కండువ, ప్యాంటు, షర్టు పైన తాంబూలము పెట్టి అల్లుని చేతికి యివ్వవలెను. అమ్మాయికి జరిపించిన విధంగానే అబ్బాయికి కూడా విధంగానే జరిపించాలి.

 

Also Read : అక్షరాభ్యాసం

Leave A Reply

Your Email Id will not be published!