Telugu Traditional Games : Ongu Dookullu –
ఒకరు కూర్చొని ఒక కాలు చాపుతారు. మిగిలిన వాళ్లు దానిపై నుంచి దాటాలి. తరవాత ఆ కాలి బొటన వ్రేళ్లుపై రెండవ కాలి మడమ పెడతారు. అది దాటినా తరవాత కుడి చేయి వ్రేళ్లు చాపి దానిపై పెడతాడు. దాని మీద నుంచి కూడా దాటాలి.
ఆ తరవాత కూర్చున్న మనిషి కాలి బొటన వేలిని చేతి వేళ్ళతో తాకుతూ వంగుంటాడు, ఆ తరవాత చేతిని మోకాలి మీద, తరవాత మడుం మీద, ఇలా పెంచు కుంటూ వెళ్తాడు. అందరు అతని మించి దాటవలసి ఉంటుంది. ఎవరైతే దాటలేక పోతారో వాళ్లు ఓడిపోయినట్లు లెక్క .
సాధారణంగా మగ పిల్లలు ఈ ఆట ఆడతారు. ఈ ఆట ఆడటం వలన శరీరానికి మంచి వ్యాయామం చేసినట్లు అవుతుంది. శరీరం దృఢత్వాన్ని పొందుతుంది.
Read More : అప్పడపడ తాండ్ర