మీదుకట్టే విధానము

Meedhu katte vidhanam

Telugu Marriage Traditions – Meedhu katte vidhanam  : ముందుగా గృహంలోని సింహద్వారమునకు మామిడి తోరణం కట్టవలెను. వరిపిండితో నేలపై పద్మం ఆకారంలో ముగ్గు వేసి, దానిపై పసుపు, కుంకుమలతో అలంకారం చేసి దానిపై క్రొత్త వస్త్రమును (పసుపుతో తడిపి నది) వేసి దానిపై కేజింపావు బియ్యం పోసి, జత తమలపాకులు ఉంచి దానిపై పసుపుతో చేసిన విఘ్నేశ్వరుని ఉంచి గణపతికి షోడ శోపచారములతో పెండ్లి కుమార్తె తల్లిదండ్రులు పూజ చేయవలెను. తరువాత తిరగలికి పసుపురాసి కుంకుమ బొట్లు పెట్టి తిరగలి పిడికి తోరము కట్టి, ఒక ముత్తయిదువుచే తిరగలిలో 5 గుప్పెళ్లు సెనగలు పోసి విసరవలెను. విధంగా ఐదుగురు ముత్తయిదువులచే చేయించవలెను.

 

 

 

తరువాత గణపతిని ఒక చిన్న పెట్టెలో ఉంచి బియ్యం, విసిరిన సెనగలు క్రొత్త టవలులో ఉంచి మూట కట్టి దేవునిగదిలో భద్ర పరచాలి. 16 రోజుల పండుగ రోజుగానీ, లోపుగానీ మూటను తీసి సెనగపప్పు బియ్యముతో ఉండ్రాళ్ళు చేసి గణపతికి నైవేద్యం సమ ర్పించి తరువాత అందరికి పంచిపెట్టవచ్చును. (ఆచారాన్ని బట్టి మినప వడియాలు కూడా పెడతారు). దీనినే మీదు కట్టే విధానం అంటారు.

 

 

Also Read : పెండ్లి కుమార్తెకు పుట్టింటివారి సారె

Leave A Reply

Your Email Id will not be published!