పెండ్లి కుమార్తెకు పుట్టింటివారి సారె
Married Daughter Parents give Saare to Bride
Telugu Marriage Traditions : వివాహం అయిన 16 రోజుల లోపుగానీ, నెల లోపుగాని, 3వ నెల లోపల ఒక మంచి ముహూర్తము చూసుకొని అమ్మాయికి సారె పెట్టి పంపించాలి. అమ్మాయి వాళ్ళు 5 కేజీల చలిమిడి, 1 కేజీ పసుపు, 2 కేజీల సున్నిపిండి, 1/2 కేజీ కుంకుమ, అరటిపండ్ల గెల, మిఠాయి ఉండలు, దువ్వెనలు, అద్దములు, (మత కొద్దీ ఇరుగు పొరుగువారికి పంచుటకు కొన్ని వస్తువులు ఇవ్వవలెను. అత్తవారింట కుటుంబ సభ్యులు అందరికి వీలు అయినంత వరకు నూతన వస్త్రాలు పెట్టవలెను. చాకలికి, వారి ఇంటి పనిమనిషికి కూడా నూతన వస్త్రాలు ఇవ్వవలెను.
అమ్మాయికి చీరలు, లంగాలు, తువ్వాళ్ళు, దుప్పట్లు, గలేబులు, స్టీలు సామానులు, బొట్టు పెట్టె, అలంకరణ సామానులు, కంచము, గ్లాసు, వీలు అయినంత వెండి సామానులు, నగదు ఇవ్వవలెను.
అమ్మాయిని పీటపై తూర్పు ముఖంగా కూర్చుండబెట్టి చీర కొంగులో చలిమిడి, 2 జాకెట్టు ముక్కలు, చిల్లర డబ్బులు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమ పెట్టాలి. అత్తగారి ఇంటినుండి అమ్మాయిని తీసుకొని వెళ్ళడానికి వచ్చిన వారికి నూతన వస్త్రాలు పెట్టాలి.
అమ్మాయితో పాటు మనవారు ఎవరో ఒకరు ఆమెతో పాటు వెళ్ళవలెను. సారె కూడా పెండ్లి విషయాలు మాట్లాడుకున్నప్పుడే సారె నిమిత్తము కూడా మాట్లాడుకోవడము మంచిది. లేదా మన శక్తిని బట్టి పెట్టవచ్చును. అమ్మాయికి సారె అనే శుభకార్యం తప్పక జరిపించాలి.
నాలుగు స్తంభాలాట
ఈ ఆట ఆడుకునేందుకు ఇంటిలో నాలుగు స్తంభాలు ఉండాలి. ఈ ఆటను ఆడుటకు ఐదుగురు బాల బాలికలు ఉండాలి. ముందుగా పంటలను వేయాలి. పండని వారు దొంగ పెట్టాలి. నలుగురు నాలుగు స్తంభాల వద్ద ఉంటారు. స్తంభం దగ్గర ఉన్నవారు వేరొక స్తంభం వద్దకు మారాలి. ఈ మార్పు సమ యంలో ఏ స్తంభమూ కూడా ఖాళీగా ఉండకూడదు. ఖాళీగా ఉన్న స్తంభాన్ని దొంగగా పెట్టిన వారు ఆ స్తంభాన్ని తాకినచో మిగిలిన వ్యక్తి దొంగగా పెట్టాలి.