మరదలు మాడ వేడుక
Mardalu Maada Veduka
Marriage Traditions : పూర్వము స్త్రీలు ధరించే బంగారు ఆభరణాలలో మాడ అనేది ఒక బంగారపు ఆభరణము. పెళ్ళిలో పెళ్ళికుమార్తెకు మాడ అనే ఆభరణం కూడా పెట్టి అలంకరించేవారు. ఆనాటి వేడుకలలో ఆ బంగారపు మాడను బావ, వదిన వరసలు అయినటువంటి వారు పెళ్ళికుమార్తెకు తెలియకుండా దాచి ఆమెను ఆటపట్టించేవారు.
ఆ వేడుక ఈనాడు ఈ విధంగా మార్పు చెందింది. పెండ్లికుమార్తె అక్కచెల్లెళ్ళు కానీ, అన్నతమ్ముళ్లు గానీ పెళ్లి కుమార్తెను ఒక గదిలో దాస్తారు. వరుడు తన భార్యను వెదికి ఎక్కడ ఉందో తెలుసు కోవాలి. ఆ సందర్భంగా బావగారికి నూతన వస్త్రాలు పెట్టి భార్యతో ఆనందంగా నడుస్తారు. ఇది బావమరదుల మధ్య అనుబంధం ఏర్పడటానికి ఈ వేడుక ఏర్పాటు చేసారు.