Telugu Tradition : Mamidi thoranam –
హిందూ సంప్రదాయంలో పండుగలు, శుభకార్యాలు జరుపుకునే టప్పుడు ఇంటికి తోరణాలు కట్టడం ఆనవాయితి. ఏదైనా ఓ శుభకార్యం ప్రారంభించారంటే చాలు.. వెంటనే గుమ్మానికి తోరణాలు కట్టేస్తుంటారు. ఆ తోరణాలు కట్టడానికి ఎక్కువగా ఉపయోగించేది మామిడి ఆకులు మాత్రమే. మామిడి ఆకులు లేకుండా ఏ శుభకార్యం జరగదు కూడా.
గృహప్రవేశ కార్యం అయిన ఇంట్లోకి మామిడితోరణాలు కళకళ లాడూతూ అతిథులకు స్వాగతం పలుకుతున్నట్లు ఉంటాయి. ఈ ఆచారము వెనుక ఓ శాస్త్రీయ విషయాన్ని గ్రహించారు కాబట్టే, అనేక శుభకార్యాలలో మామిడి ఆకును వాడతారు.
గుమ్మాలకు మామిడి తోరణాలు ఎందుకు కట్టుతారంటే.. పండుగలు లేదా శుభకార్యాల సమయాల్లో కుటుంబ సభ్యుల్లో పని ఒత్తిడిని, శ్రమను పోగొట్టేది మామిడాకు తోరణమే. కొంతమంది పండుగ రోజుల్లో కూడా ఉదయాన్నే లేవకుండా.. నిద్రపోతుంటారు అలాంటి వారికి మామిడి తోరణాలు మంచిగా పనిచేస్తాయి. ఈ తోరణాలు ఇంట్లో కట్టితే నిద్ర లేమిని పోగొడుతుంది.
ప్రాచీన కాలం నుండి పర్వదినాల్లో యజ్ఞయాగాల్లో ధ్వజారోహణం చేస్తుంటారు. దీనిని అనుసరించే తోరణాలు కట్టే ఆచారం వచ్చిందని అంటారు.
పండుగ రోజుల్లో దేవుళ్లకు పూజలు చేస్తూ.. నాకు ఈ కోరిక తీర్చు స్వామి అంటూ ప్రార్థిస్తుంటాం. ఈ కోరికలను మామిడి ఆకులే నెరవేర్చు తాయని చాలామంది నమ్ముతారు.
మామిడి ఆకుల గురించి రామాయణ,మహాభారత గ్రంధాలలో కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. ప్రతి శుభకార్యంలోను మంగళ తోరణాలు కట్టటానికి మామిడి ఆకులను తప్పనిసరిగా ఉపయోగిస్తాం. ఎందుకంటే మామిడి ప్రేమకు, సంపద, సంతానాభివృద్ధికి సంకేతం. అందుకే పూజకు ముందు ఉంచే కలశంలో కూడా తప్పనిసరిగా మామిడి ఆకులను ఉపయోగిస్తాం.
మామిడి ఆకులో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు. అందువల్ల ఆ ఆకులతో గుమ్మానికి తోరణం కడితే ఇంటిలోకి ధనం చేరి ఆ ఇల్లు సిరిసంపదలతో తులతూగుతుంది.
ఇంటి ప్రధాన గుమ్మానికి మామిడి తోరణం కడితే ఏమైనా వాస్తు దోషాలు ఉంటే తొలగిపోతాయి. అలాగే ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ తొలగి పోయి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని శుభాలే జరుగుతాయి.
ఇంట్లో ఏమైనా దుష్ట శక్తులు ఉంటే పోతాయి. అలాగే దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది.
ఈ తోరణాలు ఇంట్లో కట్టితే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. . ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంట్లో ఉండే గాలి శుభ్రమవు తుందట. ఇంట్లో ఉండే ఆక్సిజన్ శాతం పెరిగి స్వచ్ఛమైన గాలి మనకు లభిస్తుంది. తద్వారా చక్కని ఆరోగ్యం కలుగుతుందట.
మామిడాకుల పాత్ర లేకుండా ఏ శుభకార్యం జరగదు. మంగళ తోరణాలు కట్టేందుకు వాడేది మామిడి ఆకులనే. పూజకు ముందుంచే పూర్ణకుంభంలో అమర్చేది మామిడి ఆకులనే. పూర్ణకుంభమంటే భూదేవిరూపం. అందులో పోసే నీరు మనజీవితానికి మూలాధారమైనవి. ఆ కుంభంలో ఉంచే కొబ్బరికాయ, అమర్చే మామిడి ఆకులు జీవితాన్ని సూచిస్తాయి. ఆ పూర్ణకుంభం అమరిక లక్ష్మీదేవి రూపమవుతుంది.
మామిడి చెట్టును కూడా దైవ సమానంగా భావిస్తారు.మామిడి చెట్టును దైవ సమానంగా భావించడం వల్ల మన ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, పండుగలు జరిగిన మొదటగా గుమ్మానికి మామిడి తోరణాలు వేలాడదీస్తారు.