కొత్తప్పకొండ ప్రభల సంస్కృతి

Kotappakonda Prabhalu Sanskruti

Telugu Tradional Events : Kotappakonda Prabhalu Sanskruti –

ఇది గుంటూరు జిల్లా, ముఖ్యంగా నరసరావుపేట, పల్నాడు ప్రాంతంలో కనిపించే ఒక గొప్ప సంస్కృతి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మహా శివరాత్రినాడు గుంటూరు జిల్లాలోని కోటప్పకొండ, క్వారీ బాలకోటేశ్వర స్వామి, సత్రశాల ప్రాంతాలలో ప్రభల సంస్కృతి కనిపిస్తుంది.


కోటప్పకొండ గుంటూరు జిల్లా, నర్సరావుపేటకు 10 కి.మీ. దూరం ఉంది. ఇది ప్రముఖ శైవ క్షేత్రం. కొండపై త్రికూటాద్రి కోటయ్యస్వామి కొలువై ఉన్నాడు.
ప్రతి ఏడాది మహా శివరాత్రి పర్వదినాన రాష్ట్రం నలుమూలలు నుంచి భక్తులు కొండకు తరలివస్తారు. శివరాత్రి నాడు కోటప్పకొండకు 30 కి.మీ దూరంలో ఉన్న అన్ని గ్రామాల వారు ప్రభలు కట్టుకొని కొండకు వెళ్లటం ఇక్కడి సంస్కృతిలో భాగం. కోటప్ప కొండ శివరాత్రి తిరునాళ్ళలో ప్రభలే ప్రత్యాక ఆకర్షణ.

ప్రభల వైభవాన్ని చూడాలే కాని వర్ణించలేం. విద్యుత్ ప్రభల ధగదగ కాంతుల నడుమ రాత్రి సమయంలో కోటయ్య స్వామి కొలువైన కోటప్పకొండ మెరిసి పోతుంది. గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఎద్దుల బండ్లు, టాక్టర్లపై కొండకు వస్తారు. కొందరు భక్తులు ప్రభలు వెంట బండ్లు కట్టుకుని స్వామివారిని దర్శించటానికి కొండకు వెళతారు.

 

Read More : ప్రభలు

Leave A Reply

Your Email Id will not be published!