కేశాంత
Keshanta
Telugu Tradition : Keshanta – పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభ దశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్ని, బ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తు చేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదాన మని కూడా అంటారు.
ఈ సంస్కారం కూడా బ్రహ్మచారికి అతని యవ్వనారంభాన్ని, బాధ్య తలను తెలియజెప్పే సంస్కారంగానే భావించాలి. ఈ సంస్కారం అంతా దాదాపు చూడాకరణం పద్ధతిలోనే జరుగుతుంది. తేడా అంతా చూడాకరణంలో తలమీద కేశాల ఖండనం జరిగితే, కేశాంతంలో మీసాలు, గెడ్డాలను తీసి వేయటం జరుగుతుంది. –
ఈ సంస్కారాన్నే ‘గోదానం‘ అనటం కూడా ఉంది. కేశాంతం తర్వాత, గురువుకు దక్షిణగా ఒక గోవును ఇవ్వటం వల్లనే దీనికే ‘ గోదానం‘ అనే పేరు వచ్చిందనాలి.