కాశీ యాత్ర

Kashi Yatra

Telugu Marriage Tradition : Kashi Yatra –

బాజా భజంత్రీల మధ్య వరుడు గొడుగు పట్టుకొని చేత్తో కర్ర పుచ్చుకొని కాళ్ళకు పాదు కలు ధరించి మెడలో పసుపు బట్టను వేసుకొని తాను సన్యాసం స్వీకరించేందుకు కాశీయాత్రకు పోతున్నానని బయలు దేరుతాడు. కాశీ యాత్ర ఘట్టం స్నాతకంలో చాలా సరదాగా జరిగే కార్యక్రమం. తన శేష జీవితం ఇక కాశీలో గడపాలని భావిస్తున్నానని, దానికి బంధుమిత్రుల అనుజ్ఞ కావాలని వరుడు కోరతాడు. క్షణికా వేశంలో తీసుకున్న నిర్ణయం సరైంది కాదని, గృహస్థాశ్రమం స్వీకరించి, ధర్మబద్ధంగా ఇంద్రియ సుఖాలను అనుభవించి, పరిపూర్ణమైన వైరాగ్యం కలిగిన తర్వాతనే భార్యా సమేతంగా వానప్రస్థాశ్రమంలో ప్రవేశించా ల్సిందిగా పురోహితుడు (గురువు) హితవు పలుకుతాడు.

 



ఇక పెళ్ళి కూతురు వైపునుంచి వచ్చిన వారు (బావ మరిదిమేన మామతాత గారు లాంటి వారు) “బంగారు ఆభరణాలతో అలంకరించ బడిన వారిఅమ్మాయినిచ్చి వివాహం చేద్దామనుకుంటున్నామని, అగ్నిసాక్షిగా అమెను వివాహమాడమని, ముందుగా తమ ఇంటికి వచ్చి ఆతిథ్యం స్వీకరించమని వరుడికి నచ్చచెప్పి, కాశీయాత్ర ఆలోచనను విరమింపచేసే ఘట్టం ఇది.

చాలా కోలాహలంగా పెళ్ళికితరలి పోయే ముందరజరిగే సరదా కార్యక్రమం ఇది. ఇలా స్నాతకం వ్రతాన్ని పూర్తి చేసుకొని, వరుడి బంధుమిత్రులందరు వధువు గృహానికి (వసతి గృహానికి) బయలుదేరు తారు. బయలుదేరే ముందు, మంగళ స్నానాలు చేయడం, అలంకరించు కోవడం, పల్లకి లాంటి వాహనాలు సిద్ధం చేసుకోవడం మామూలే. బయలు దేరే ముందర, శుభకార్యానికి బయలుదేరుతున్నామని, వెనక్కు పిలవడంనిందించడందగ్గడం, తుమ్మడం లాంటివి లేకుండా వుండాలన్న అర్థం వచ్చే మంత్రాన్ని చదువుతారు. కొన్ని కులాల వారికి సంప్రదాయం లేదు. సమయంలో శకునాలన్నీ మంగళప్రదంగానే ఉండాలని అనేక శకున మంత్రాలు పఠిస్తాడు

 

Also Read : స్నాతకం/సమావర్తనము

Leave A Reply

Your Email Id will not be published!