కర్రా బిల్లా ( చిల్లగర్ర ఆట )

Karra Billa (Chillagarra game)

Telugu Traditional Games : Karra Billa (Chillagarra game) –

ఆట గోణి బిళ్ళ, గూటి బిళ్ళ, బిళ్ళ కర్ర, చిల్లంగోడు, కోడింబిళ్ళ, చిల్లగాల, బిల్లంగోడు అనే రకరకాల పేర్లతో ప్రచారంలో ఉంది. సుమారు 4 అంగుళాలు ఉన్న కర్ర ముక్క, రెండు అడుగులు పొడవుగల కర్ర ఒకటి ఆటకు ఉపయోగింతురు. వీటిలో చిన్న దానినిబిళ్ళఅనీ, పెద్దదాన్నికర్రఅని అందురు. అందువల్లనే ఆటకుకర్రబిళ్ళఅని పేరు. నేలమీద చిన్నకంచా‘ (గుంట) త్రవ్వి కంచా మీదబిళ్ళను ఉంచి కర్రతో ఎగుర కొట్టుదురు. దీనినిగూటుటఅందురు. సాధార ణంగా ఆటను ఇద్దరు లేక నలుగురు ఆడుదురు.

 

ఒకరు బిళ్ళను గూటునప్పుడు రెండవవారు కంచాకు కొంత దూరంలో నిలబడి బిళ్ళ క్రింద పడకుండా పట్టుకోవలెను. అలా పట్టుకోగలిగినచో బిళ్ళను గూటిన వాడు ఓడినట్టు. అలా పట్టుకోలేకపోతే బిళ్ళపడిన స్థలం దగ్గర నుంచి దానిని తిరిగి కంచా దగ్గరకు విసరును. విసరినప్పుడు కంచా నుంచి బిళ్ళ ఉన్న స్థలాన్ని కర్రతో కొలవగా దూరం ఒక కర్ర కంటే ఎక్కువ దూరం ఉంటే ఆట సాగించవచ్చును. తక్కువ ఉంటే గూటిన వాడు ఓడిపోయినట్లే.

గూటినవాడు బిళ్ళ చివరను కర్రతో కొట్టి అది పైకి లేచినపుడు దూరమునకు పోవునట్లు దానిని కర్రతో కొట్టి, విసరును. విధముగా మూడు పర్యాయములు కర్రతో బిళ్ళను కొట్టి మూడవసారి కొట్టినప్పుడు బిళ్ళ పడిన స్థలం నుంచి కంచావరకుగల దూరమును కొలువవలెను. పది కర్రల పొడవునులాలఅందురు.

గూటినవాడు దూరమును అంచనాగా ఎన్ని లాలలుండునో చెప్పును. చెప్పినదాని కన్నా ఎక్కువ దూరమున్న అతడు గెలిచినట్లు. అలా లెక్కపెట్టినప్పుడు ఎన్ని లాలలుంటే అన్ని సార్లు ఓడిపోయినవారు ఒంటి కాలితో గెంతుతూ కూత పెడుతూ బిళ్ళపడిన స్థలం నుంచి కంచా నుంచి బిళ్ళ వరకు కుంటుతూ రావలెను. ఆటను వర్లాకిమిడి, బరంపురం ప్రాంతాల్లోగిల్లీ దండిఅని, కృష్ణాజిల్లా ప్రాంతంలోగోడి బిళ్ళఅని, ఉత్తరదేశంలోగూలిదండాఅందురు.

 

Read More : గోళీలాట

Leave A Reply

Your Email Id will not be published!