కర్ణవేధ
Karna Veda
Telugu Tradition : Karna Veda : కర్ణవేధ అనగా చెవులు కుట్టించడం. ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు.
రోగాదులనుండి రక్షణకై, భూషణముల కొరకు బాలకుని కర్ణములు కుట్టవలెను అని సుశ్రుతము పేర్కొనుచున్నది.
నిజమైన కర్ణవేధ అనగా గురువు శిష్యుని చెవిలో మంత్రోపదేశము చేయుటే. ఈ అర్థమే నిరుక్త మంత్రమునకు అర్థము.
చెవులు కుట్టించుటయను సంస్కారము దివ్యవర్చస్సు కలిగి, ఉత్తరోత్తర గురూపదేశ మన్తధారణ సిద్ధి కలుగుటకు, పితృదేవతల అనుగ్రహ నిమత్తము చేయవలసిన సంస్కారము.
వివిధ శాస్త్రాలలో కర్ణవేధ
ఏ గృహ్యశాస్త్రాలలోనూ నేరుగా ‘కర్ణవేధ‘ గురించిన ప్రస్తావన లేదు. పారస్కర సూత్రాలకు చెందిన పరిశిష్టంలో మాత్రం దీని గురించిన వివరణ ఉంది. అథర్వణ వేదంలోనూ దీని ప్రస్తావన ఉంది. బిడ్డ పుట్టిన 10వ రోజు, లేదా 12వ రోజు లేదా 16వ రోజున ‘కర్ణవేధ‘ సంస్కారం జరపాలని బృహస్పతి అభిప్రాయం. అంత చిన్న వయసులోనే దీన్ని నిర్వహించడం వల్ల బిడ్డకు అంత బాధాకరంగా ఉండదని భావన. అయితే, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, కర్ణవేధను బిడ్డకు ఆరు నెలలో కానీ, లేదా ఏడవ నెలలో కానీ చేస్తే మంచిదని శుశ్రుతుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక మంచి రోజున తల్లి ఒడిలో బిడ్డను తూర్పు దిక్కు వైపు చూస్తున్నట్టుగా కూర్చుండబెట్టి, ఆడుకునేందుకు బొమ్మలను ఇచ్చి, కొంచెం ఆడిస్తూ, ముందు కుడి చెవిని, తర్వాత ఎడమ చెవిని కుట్టాలి. చెవి కుట్టిన చోట నూనెతో తడిసిన పత్తిగుడ్డతో ఒత్తాలి అని శాస్త్రము తెలు పుచున్నది.
చెవులు కుట్టునప్పుడు చేయవలసిన పూజ
చెవులు కుట్టునపుడు విష్ణు, రుద్ర, బ్రహ్మ, సూర్య చంద్ర, దిక్పా లకులకు, అశ్వినీ దేవతలకు, సరస్వతికి, గోవునకు, పూజ చేయవలెను. మగ శిశువునకు లక్కపూసి కుడి చెవిని ముందుగా కుట్టవలెను.
బంగారు సూదితో కుట్టుట శ్రేష్ఠము. శిశువునకు చెవులు కుట్టిన తరువాత దృష్టి దోషము తగులకుండా బొట్టు పెట్టవలెను. తరువాత దేవునిముందు ఉంచి నమస్కారము చేయించాలి.
కాత్యాయన సూత్రమునందు చెప్పబడిన ఈ సంస్కారము ఈ విధముగా ఉన్నది. ఒక శుభదినమున మధ్యాహ్నమునకు పూర్వము, పూర్వాభిముఖముగా శిశువును కూర్చొండబెట్టుకొని ‘మేము మంగళ ప్రదమైన మాటలను విందుముగాక‘ అను అర్థమునిచ్చు మంత్రములు గానము చేసిన తరువాత కుడి చెవిని కుట్టవలెను. ‘వక్ష్యంతి..’ మొదలైన మంత్రములు చదివిన తరువాత ఎడమ చెవి కుట్టవలెను. బ్రాహ్మణ భోజనముతో సంస్కారము పూర్తి అగును.
క్రమముగా ఈ సంస్కారము వివిధాంగములతో సమృద్ధి చెందినది. ‘సంస్కారము చేయువాడు విష్ణు, శివ, బ్రహ్మ, సూర్య, చంద్ర, దిక్పాలక, నాసత్యులు, సరస్వతి, బ్రాహ్మణుడు, గోవులు – వీరిని పూజించవలెను.
కుల గురువును అలంకరించి బ్రహ్మాసనముపై కూర్చొండపెట్టవలెను.
తల్లి కుంకుమను శిశువు చెవులకు అద్దును. వైద్యుడు మగ శిశువైనచో కుడిచెవిని, ఆడ శిశువైనచో ఎడమ చెవిని ముందుగా కుట్టును. తరువాత విద్వాంసులను, బంధువులను పూజింపవలెను‘ అని విష్ణుధర్మోత్తరమున ఉన్నది. శర్కర, మథు, ఘృతములు ఆహూతులకు ఇవ్వవలెను.
బ్రాహ్మణులకు పైన చెప్పబడిన మూడు మధురములను ఇవ్వవలెను. బ్రాహ్మణాశీర్వచనముచే ఈ సంస్కారము పూర్తి అగును. బిడ్డ చెవులు కుట్టి నప్పుడు ఏడ్చినచో తేనెను నాకించవలెనని కొన్ని గ్రంథములలో ఉన్నది.
చెవులు కుట్టడానికి వాడే సూది
క్షత్రియులకు బంగారంతో,
బ్రాహ్మణ, వైశ్యులకు వెండితో,
శూద్రుడైనచో లోహమయమైన సూదితో నిర్వహించవలెనని వీరమిత్రోదయమున ఉన్నది.
ದಾಡಿ
ఆడేవాళ్ళు ఇద్దరుంటారు. 9 నప్పులుంటాయి. ఒకరి తర్వాత ఒకరు, ఒక్కొక్కటి చొప్పున నప్పాలి. ఎవరివైనా మూడు నప్పులు, అడ్డంగా గాని, నిలువుగా గాని ఒకే వరుసలో వస్తే ఒక దాడి జరిగినట్లు. దాడి జరిపిన వాళ్ళు ఎదుటివారి నప్పులలోంచి ఒక నప్పును (దాడి జరగనిది మాత్రమే) తీసుకుంటారు. ఒకసారి దాడి జరిపిన నప్పుని, ప్రక్కకు జరిపి, దానితో మరల దాడి చెయ్య వచ్చును. ఇలా ఆడే ఇద్దరిలో ఎవరివో ఒకరి నప్పులు పూర్తయ్యేవరకు ఆడుకోవచ్చును. మూలలో బాణం గుర్తులున్న కోణాలలో వరసగా నప్పులు పెట్టడం దాడిగా ఒప్పుకోబడదు.