Telugu Tradition : Jogata –
తెలంగాణ ప్రాంతంలో హరిజనులలో జోగువారను ఒక నర్తకులశాఖ వారున్నారు. వారు డప్పుల వాద్యము ఆధారముగా చేసుకొని నృత్యము చేస్తారు. ఈ జాతి వారిలో ఎవరైనా చనిపోయినప్పుడు శవమును స్మశాన వాటికకు గొనిపోవునప్పుడు జోగాట ఆడుతూ వెళ్తారు.
వీరి నృత్యము లన్నింటిలోను పిండోత్పత్తి క్రమము తెల్పునట్టిది ప్రత్యేకంగా చెప్పదగినది. ఈ నృత్యంలో జీవుడా తల్లి గర్భంలో బిందు రూపంలో ప్రవేశించినది మొదలు, వివిధ మాసములందు ఆ పిండము పెరుగు విధానము, ప్రసవం, అటుపై జీవితములోని వివిధ ఘట్టములను వారు చక్కగా ఆడతారు.
ఇలాంటిదే వేదాంత చర్యలతో కూడిన గొల్లకలాపము నందలి గొల్లభామ శృతి, స్మృతుల ఆధారంగా ఉదాహరణలిస్తూ అభినయించెదరు. కేవలం చావు సందర్భాలలోనే కాక సంతోష సమయాలలో, వేడుకలలో, వివాహాలలో, ఉత్సవాల్లో కూడ ఈ జోగువారు వారి డప్పు నృత్యాన్ని ప్రదర్శిస్తారు. సర్కారాంధ్రలో వీరిని మాదిగలంటారు. చాటింపు వేయడం, జాతర్లకు, ఉత్సవాలకు డప్పు వాయిద్యాలను వేస్తుంటారు.