హరికథ

Harikatha

Telugu Tradional Events : Harikatha –

హరికథ అన్నది తెలుగు వారి సంప్రదాయ కళారూపం. హిందూ మతపరమైన భక్తి కథలు, ప్రధానంగా హరిలీలలను సంగీత, సాహిత్యాల మేళవింపుతో చెప్పడాన్ని హరికథ అంటారు.


హరికథ పుట్టుక

హరికథ పుట్టుక గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. హరికథ వేదాలనుండి పుట్టిందని కొందరు భావిస్తారు. మరికొందరు నారద భక్తి సూత్రము హరికథ యొక్క మూలమని భావించారు. ఇంకొందరు యక్షగానమే హరికథగా రూపాంతరం చెందిందని భావిస్తున్నారు. హరికథ మూలమేదైనా ఆంధ్రదేశములోని హరికథా ప్రక్రియ తన ప్రదర్శనలో వినూతనత్వములోను, నవరస సమ్మేళనంతోనూ, వివిధ రాగాలను పలికించటములోనూ ప్రత్యేకమైనది.

అన్ని పాత్రలలో ఒకే వ్యక్తి

కథ చెప్పువారిని భాగవతులు లేదా భాగవతార్ అని అంటారు. ఆదిభట్ల నారాయణదాసు, పరిమి సుబ్రమణ్యం భాగవతార్ మొదలగు వారు ప్రక్రియలో ఆద్యులు, ప్రముఖులు.

హరికథా కళారూపంలో ఒకే ఒక పాత్రధారి మూడు గంటల పాటు కథాగానం కావిస్తాడు. ఒకే వ్వక్తి అన్ని పాత్రల్లోనూ జీవించి, రసవత్తరంగా నటిస్తాడు. నోటితో వాచికం చెపుతూ, మృదుమధురమైన గానం పాడుతూ, ముఖంలో సాత్వికమూ, కాలితో నృత్యమూ చేతులతో ఆంగికమూ గుప్పిస్తూ ఆకర్షణీయ మైన ఆహార్యంతో ఏకకాలంలో అభినయిస్తాడు. హరికథలో వున్న ప్రత్యేకత ఇదే.

హరికథకుని వేషధారణ కూడా సామాన్యమే. చేతిలో చిరతలు, కాలికి గజ్జెలు, పట్టు దోవతి పంచకట్టు, పట్టు కండువా నడుముకు కట్టి, మెడలో ఒక పూలహారం ధరించి చక్కగా తిలకం దిద్దుతాడు.

 

Read More : బుర్ర కథ

Leave A Reply

Your Email Id will not be published!