గృహప్రవేశం
Gruha Pravesam Cermony
Telugu Hindu Tradition : Gruha Pravesam Cermony
ఒక పళ్ళెములో పసుపు, కుంకుమ, నవ ధాన్యములు, ఉప్పు, పెరుగు, కందిపప్పు, కవ్వము, నిమ్మకాయలు, చాకు, కుడుములు, కొబ్బరికాయలు 12, పురోహితుని జాబితా ప్రకారము ఆడవారు పూజ పళ్ళెము, మగవారు సీతారాములు, లక్ష్మీదేవి పటములు పట్టుకొని గృహప్రవేశం చేయాలి. కుడుములు : బియ్యం పిండి ఒక డబ్బా, ఉప్పు, పశ్చిశనగపప్పు గుప్పెడు. నీళ్ళు వేడి నీరుపోసి కలిపి ఇడ్లి పళ్ళెములలో వండవలెను. ఒక డబ్బా పిండికి పది కుడుములు వచ్చును.
గృహప్రవేశము అయిన తరువాత కుడుముల టిఫిను మూత తీయ వలెను. కుడుము ఆవిరి ఇంట్లోకి రావలెను. ముందుగా బ్రాహ్మణుడు వేదమంత్రాలతో గుమ్మడికాయ మెల్లాలో కొట్టిస్తారు.
తరువాత ప్రతి గుమ్మం ముందు కొబ్బరికాయ కొట్టించి, నిమ్మకాయ కోసి గుమ్మానికి రెండువైపులా పెట్టిస్తారు. మనతో పాటు ఆవును, దూడను తెచ్చి ఇంట్లో అన్ని గదుల్లో తిప్పి, తీసుకు వెళతారు. పూజవద్ద పీటల మీదకు, ఆకులు ఒకకట్ట, వక్కలు 100 గ్రా., ఎండు ఖర్జూరము 250 గ్రా., పసుపు కొమ్ములు 250 గ్రా., అరటిపండ్లు 12, కొబ్బరికాయలు 2, బియ్యము 2 1/2 కేజీ, పీటలమీద తుండు, కట్టుబడి సామాను పెట్టి బ్రాహ్మణుడు పూజ చేస్తాడు.
పుట్టింటి వాళ్ళు కట్నాలు తీసుకురావాలి. పొంగలి గిన్నె పుట్టింటి వారు ఇవ్వవలెను. ఇత్తడి గిన్నె, గరిట, మూత, పొంగలిగిన్నె, పాతగుడ్డ, మసిగుడ్డ కావలెను. ఇంటి ఆడవాళ్ళుకాని, ఆడపడుచు కాని పెట్టవచ్చును. గిన్నెకు పసుపురాసి బొట్టు పెట్టి పాలు పొంగించాలి. పాలు పొంగించిన తరువాత పొంగలి వండాలి.
ఆ సందర్భంగా ఆడపడుచును పీటలపైన కూర్చుండబెట్టి, బొట్టు పెట్టి తాంబూలంతో పాటు బంగారము కాని దక్షిణకాని ఇవ్వవలెను. వాస్తు పూజ అయినాక పొంగలి, కుడుములు అల్లపుచెట్ని పెట్టి అందరికి ఇవ్వ వలెను. గుమ్మడికాయకు కళ్యాణం బొట్టు పెట్టవలెను. శ్రీ సత్యన్నారా యణస్వామి వ్రతముచేసి అందరికి భోజనము ఏర్పాటు చేసుకొనవలెను.