Telugu Marriage Tradition : Gothram – Pravara –
గౌరీ పూజ జరిగే చోట ఒక్కసారి, లాంఛనంగా, ఇరు పక్షాల వారి గోత్రం–ప్రవర చెప్పే కార్యక్రమం, పురోహితుల చాతుర్యాన్ని బట్టి అత్యంత ఆసక్తికరంగా వినసొంపుగా వుంటుంది. “గోత్రం” అంటే వంశం, “ప్రవర” అంటే ఆ వంశం మూల పురుషుల సమాచారం. మీ అమ్మాయిని, మా అబ్బాయికి ఇచ్చి వివాహం జరిపించమని వరుడి తండ్రి, కన్యా దాతను కోరడమే ఈ వేడుక ముఖ్య ఉద్దేశం.
“చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్య శ్శుభం భవతు – త్రయాగ్గేయ ప్రవరాన్విత యజుర్వేదినే, తైత్తిరీయ శాఖాధ్యాయినే, ఆపస్తంబ సూత్రిణే, శర్మణా నమ్ర, శర్మణ పౌత్రాయ, శర్మణ పుత్రాయ, .. శర్మణే వరాయ, భవదీయాం కన్యాం ప్రజాసహత్వ కర్మభ్యో ప్రణీమహే”
(మూడు ఋషులున్న గోత్రం కలవాడూ, యజుర్వేదాన్ని అభ్య సించిన వాడూ, ఆ వేదం ప్రకారం తన ఇంటి కార్యక్రమాలను నడిపించే వాడూ, తైత్తరీయ శాఖను ఆపస్తంబ సూత్రాన్ని అభ్యసించి అనుసరించే వాడూ, మునిమనుమడూ, మనుమడూ, పుత్రుడూ అయిన అనే వరుడికి మీ కూతురునిచ్చి వివాహం చేయమని అడగడానికి వచ్చాం” అని అడుగు తాడు. ఇలా వంశం వివరాలు చెప్పడం వల్ల కన్యాదాత చివరివరకూ ఆలోచించుకునే అవకాశం వుందింకా.
ఇవేవీ తెలియకపోతే (అందరి సమక్షంలో), ఫలానావారి పిల్లవాడిని చేసుకున్నాం–ఇప్పుడు అనుభవిస్తున్నాం అని భవిష్యత్ లో అనవచ్చు. కన్యాదాత, వరుడి వివరాలు ముత్తాత తరం దగ్గర నుండి విన్న తర్వాత, ఆ సంబంధం తనకి ఇష్టమైతే, వెంటనే తన వధువు (కూతురు) వివరాలు కూడా చెప్పి అబ్బాయి తన కూతురుని చేసుకోమని అడుగుతాడు. వివాహ నిబంధనలు : గౌతముడు మరియు ఆపస్తంబుడి ప్రకారము, సగోత్రీయుల మధ్య వివాహాలు కుదరవు, చేసుకోకూడదు. ఎందుకంటే ఒకే గోత్రములో పుట్టినవారు ఒకే ఇంటి వారవుతారు. కాబట్టి వారు అన్నా చెల్లెళ్ళో , అక్కా తమ్ముళ్ళ, తండ్రీ కూతుళ్ళో , తల్లీ కొడుకుల వరస కలవారో అవుతారు.
కోతికొమ్మచ్చి
ఈ ఆటలో ముందుగా ఒకరిని దొంగగా ఎన్నుకుంటారు. మిగతా వారిలో ఎవరో ఒకరు ఒక కర్రను వృత్తాకారంలో గీచిన గీతలోనుండి విసురుతారు. ఇలా వృత్తాకారంలో గీచిన గీతను గిరి అని కూడా పిలుస్తారు. అలా విసిరిన కర్రను దొంగ తీసుకొచ్చి గిరిలో ఉంచుతాడు. ఆ తర్వాత మిగతా వారిలో ఎవరో ఒకరిని తాకడానికి ప్రయత్నిస్తాడు. వారు అతనికి దొరకకుండా చెట్లెక్కి దాగి ఉంటారు. దొంగ వారిలో ఎవరో ఒకరిని తాకగల్గితే అలా దొరికిన అతను తర్వాత దొంగ అవుతాడు. ఒక వేళ దొంగ ఒకరిని తాకే ప్రయత్నంలో ఉండగా ఎవరో ఒకరు గిరిలో ఉన్న కర్రను తొక్కినట్లయితే మరలా అతనే దొంగగా ఉంటాడు.