గోళీలాట

Golilata Game

Telugu Traditional Game : Golilata Game –

గోళీలాట పిండికాయ, రాతి పింజా, సీసము, బొండు మొదలగునవి గోళీలలో రకములు. ఆటలలో కంచాలాట, బర్రాట, పెద బర్రాటలు కొన్ని రకములు కలవు. బరాట యందు కాయ పెచ్చుచచ్చును బట్టి ఆడుచుందురు. ఎవరి కాయ హెచ్చయినచో వారు ముందర కొట్టుచుం దురు. కంచాలాట యందు, క్రింది వరుస ప్రకారముగ ఆడుచుందురు. ఒకటి, ఒండు, రెండోయి రోలు, మూడోయి ముత్తి,

నాలగోయి నవ్వ, ఐదు బండు, ఆరొక దార, ఏడి చారబొద్దు, ఎనమదల కున్ను, తొమ్మదల మొగ్గ, తొట్టికి లగ్గం, విధంగా పదిసార్లు కాయని ఎవరయితే ముందర కొట్టెదరో వారు పండినట్లు అనగా వాడికను ఆడవలసిన పనిలేదు. చివరకు మిగిలిన వానిచే పండిన వారందరు దేకుళ్ళు పెట్టించెదరు. (దేకుళ్ళు అనగా గోళీకాయను మోచేతితో లేక ముంజేతితో నెట్టుట).

 

 

 

Read More : బొంగరాలాట

 

 

Leave A Reply

Your Email Id will not be published!